విజయవాడలో రోజా కొత్త ఇల్లు.. భర్తతో గృహప్రవేశం..

వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే కొత్త ఇంట్లోకి ఆమె భర్తతో కలిసి గృహప్రవేశం చేశారు. తాజాగా.. ఏపీ అసెంబ్లీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె విజయవాడలో ఇల్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నూతన గృహంలో రోజా, భర్త సెల్వమణితో కలిసి పూజలు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గతంలో నగరిలో కూడా ఆమె ఇల్లు తీసుకున్నారు. కాగా.. అటు ప్రజలకు నవరత్నాలను సమర్థవంతంగా […]

విజయవాడలో రోజా కొత్త ఇల్లు.. భర్తతో గృహప్రవేశం..

Updated on: Jun 21, 2019 | 12:01 PM

వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే కొత్త ఇంట్లోకి ఆమె భర్తతో కలిసి గృహప్రవేశం చేశారు. తాజాగా.. ఏపీ అసెంబ్లీలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె విజయవాడలో ఇల్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నూతన గృహంలో రోజా, భర్త సెల్వమణితో కలిసి పూజలు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో గతంలో నగరిలో కూడా ఆమె ఇల్లు తీసుకున్నారు.

కాగా.. అటు ప్రజలకు నవరత్నాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా చూసే బాధ్యతను కూడా సీఎం జగన్ రోజాకు అప్పగించే అవకాశం కూడా ఉందని చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే రోజాకు ఏపీఐసీసీ చైర్మన్ పదవిని కూడా అప్పగించారు సీఎం జగన్.

Follow Us