జగన్ కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ‘నాడు-నేడు’..

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 10 రకాల సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.

జగన్ కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో 'నాడు-నేడు'..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 4:24 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ 10 రకాల సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమంపై అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అంగన్‌వాడీ కేంద్రాల్లో సంక్షేమంపై పది రోజుల్లో కార్యాచరణ తీసుకురావాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని అన్నారు.

సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న సీఎం జగన్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, 36నెలల్లోపు శిశువులకు ఒకేలా కార్యకలాపాలు చేపట్టాలని అన్నారు. 36 నెలల నుంచి 72 నెలల పిల్లలను మరో విధంగా చూడాల్సి ఉంటుంది…ప్రీప్రైమరీ-1, ప్రీప్రైమరీ-2లపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని,సిలబస్‌ పైనా పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ప్రీప్రైమరీ బోధన ఉంటే బాగుంటుందని సీఎం వివరించారు. అంగన్‌వాడీ పిల్లల్లో లెర్నింగ్‌ స్కిల్స్‌ కోసం టూల్స్‌, టీవీ, ప్రత్యేక పుస్తకాలు ఉండాలన్నారు. కేంద్రాల్లో పరిశుభ్రతపైనా శ్రద్ధపెట్టాలని వెల్లడించారు.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..  

Latest Articles