AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనవరాలితో కలిసి స్టెప్పులు వేసిన మెగాస్టార్ చిరంజీవి

లాక్‌డౌన్‌తో షూటింగ్స్ లేక ఇంటి వద్దనే ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఇంట్లో పనులూ చేస్తూ.. మొన్న అబ్బుర పరిచిన చిరు.. ఇప్పుడు మనవరాలితో కలిసి చిన్న చిన్న స్టెప్పులు వేశారు. ఏడాది వయసున్న తన మనవరాలు నవిష్కను ఆటపట్టిస్తూ..

మనవరాలితో కలిసి స్టెప్పులు వేసిన మెగాస్టార్ చిరంజీవి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 4:36 PM

Share

లాక్‌డౌన్‌తో షూటింగ్స్ లేక ఇంటి వద్దనే ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఇంట్లో పనులూ చేస్తూ.. మొన్న అబ్బుర పరిచిన చిరు.. ఇప్పుడు మనవరాలితో కలిసి చిన్న చిన్న స్టెప్పులు వేశారు. ఏడాది వయసున్న తన మనవరాలు నవిష్కను ఆటపట్టిస్తూ.. ఆ చిన్నారితో పాటు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను మెగాస్టార్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ‘ఖైదీ నెంబర్.150’ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

ఈ వీడియోలో తన మనవరాలు నవిష్కను ఒడిలో కూర్చోపెట్టుకొని, తనను ఏ పాట కావాలని చిరంజీవి అడగగా.. దానికి ‘మీమీ’ అంటూ ముద్దుగా చెప్పింది నవిష్క. ఎప్పుడూ అదే పాటేనా మరోకటి విందామని ఆ బుజ్జాయితో చెప్పగా, బుంగబూతి పెట్టుకుని ఏడవడం ప్రారంభించింది. వెంటనే సముదాయించి.. టీవీలో ‘మిమ్మీ మిమ్మిమ్మీ’ సాంగ్‌ని ప్లే చేశారు చిరు. అప్పుడు ఆనందంతో గంతులు వేసింది నవిష్క. తనతో పాటే.. చేతులూ కదుపుతూ డ్యాన్స్ చేశారు మెగాస్టార్. అయితే ఈ పాటని మధ్యలో ఆపి మనవరాలిని ఆటపట్టించారు చిరు.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

Follow Us