మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం..6గురు ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకూ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తాజాగా ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలకు  అసెంబ్లీ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతి ఆమోదముద్ర వేశారు.  తులసీ సిలావత్‌, ఇమర్తి దేవీ, ప్రద్యుమ్నన్‌ సింగ్‌ తోమర్‌, మహేంద్ర సింగ్‌ సిసోడియా, ప్రభురామ్‌ చౌదరీ, గోవింద్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందాయి. అంతకుమందే వారిని కేబినెట్ నుంచి తొలగించారు.  ఇక మార్చి 16 నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు స్పీకర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్ […]

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం..6గురు ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం
Follow us

|

Updated on: Mar 14, 2020 | 10:28 PM

మధ్యప్రదేశ్‌ రాజకీయాలు రోజురోజుకూ కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తాజాగా ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలకు  అసెంబ్లీ స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతి ఆమోదముద్ర వేశారు.  తులసీ సిలావత్‌, ఇమర్తి దేవీ, ప్రద్యుమ్నన్‌ సింగ్‌ తోమర్‌, మహేంద్ర సింగ్‌ సిసోడియా, ప్రభురామ్‌ చౌదరీ, గోవింద్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందాయి. అంతకుమందే వారిని కేబినెట్ నుంచి తొలగించారు.  ఇక మార్చి 16 నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు స్పీకర్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభలుతోన్న నేపథ్యంలో అసెంబ్లీకి వచ్చే వారందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. మరోవైపు బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నిర్బందంలో ఉన్నారని, వారు బడ్జెట్ సమావేశాలకు వచ్చేలా చూడాలని సీఎం కమల్‌నాథ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో  మధ్యప్రదేశ్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సింధియాకు మద్దతుగా బెంగుళూరు వెళ్లారు. సింధియా రాజీనామా అనంతరం ఆ ఎమ్మెల్యేలు కూడా వారి పదవులకు రాజీనామా చేసినట్టు రాజ్‌భవన్ వర్గాల సమాచారం.