మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషమం: బోండా ఉమా

| Edited By:

Mar 13, 2020 | 3:17 PM

Macherla Incident: మాచర్ల ఘటనలో గాయపడిన హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. తమపై దాడి చేసేందుకు మూడు చోట్ల ప్రయత్నాలు చేశారన్న ఆయన.. తాను, బుద్ధా వెంకన్న అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనలో గాయపడ్డ హైకోర్టు న్యాయవాది పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉందని తెలిపారు. పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం తన సొంతానికి ఉపయోగించుకుంటోందని బోండా ఉమా విమర్శించారు. టీడీపీ […]

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషమం: బోండా ఉమా
Follow us on

Macherla Incident: మాచర్ల ఘటనలో గాయపడిన హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. తమపై దాడి చేసేందుకు మూడు చోట్ల ప్రయత్నాలు చేశారన్న ఆయన.. తాను, బుద్ధా వెంకన్న అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనలో గాయపడ్డ హైకోర్టు న్యాయవాది పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉందని తెలిపారు.

పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం తన సొంతానికి ఉపయోగించుకుంటోందని బోండా ఉమా విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మిగిలిన పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. తమకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయన్నారు. బాబు, లోకేష్‌లను రాజకీయాల్లో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

పోలీసులపై తమకు నమ్మకం లేదని.. వారే వైసీపీ నాయకులకు సమాచారాన్ని అందిస్తున్నారని బోండా ఉమా ధ్వజమెత్తారు. అధికార పార్టీ అరాచకాలపై తాము గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి అక్రమాలు జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…