యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం, అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం

యూపీలో గోవధ నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని దుర్వినియోగం వల్ల అమాయకులు జైలు పాలవుతున్నారని కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చాలా సందర్భాల్లో అసలు మాంసాన్ని నిపుణులు ఎనలైజ్ చేయకుండానే  అధికారులు గోమాంసంగా ముద్ర వేస్తున్నారని పేర్కొంది. గోవధకు పాల్పడ్డాడన్న ఆరోపణపై జైలు శిక్ష పడిన రహముద్దీన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది. అతనికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. ఇతనిపై నిర్దిష్టమైన […]

యూపీలో గోవధ నిషేధ చట్టం దుర్వినియోగం, అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 26, 2020 | 8:51 PM

యూపీలో గోవధ నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని దుర్వినియోగం వల్ల అమాయకులు జైలు పాలవుతున్నారని కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చాలా సందర్భాల్లో అసలు మాంసాన్ని నిపుణులు ఎనలైజ్ చేయకుండానే  అధికారులు గోమాంసంగా ముద్ర వేస్తున్నారని పేర్కొంది. గోవధకు పాల్పడ్డాడన్న ఆరోపణపై జైలు శిక్ష పడిన రహముద్దీన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది. అతనికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. ఇతనిపై నిర్దిష్టమైన ఆరోపణలను పోలీసులు తమ ఎఫ్ ఐ ఆర్ లో వివరించకుండానే జైలుకు పంపడమేమిటని ప్రశ్నించారు. చాలామంది బహుశా తాముచేయని నేరానికి జైలు పాలవుతున్నారని ఆయన అన్నారు.