#Latest News ప్రధానితో కోమటిరెడ్డి భేటీ.. ఈ నాలుగేనా..?

కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఓ ఎంపీ ప్రధాన మంత్రిని కల్వడం పెద్ద విశేషమేమీ కాకపోయినప్పటికీ.. ప్రతీ రోజు పార్లమెంటు వేదికగా ప్రధానిని తిట్టిపోసే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ప్రధాన మంత్రితో...

#Latest News ప్రధానితో కోమటిరెడ్డి భేటీ.. ఈ నాలుగేనా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 4:09 PM

Komatireddy Venkatreddy met Prime Minister Modi: కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఓ ఎంపీ ప్రధాన మంత్రిని కల్వడం పెద్ద విశేషమేమీ కాకపోయినప్పటికీ.. ప్రతీ రోజు పార్లమెంటు వేదికగా ప్రధానిని తిట్టిపోసే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ప్రధాన మంత్రితో భేటీ అవడం మాత్రం రాజకీయంగా చర్చకు దారితీసింది. టీపీసీసీ అధ్యక్ష రేసులో వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రధానిని కల్వడం ద్వారా తమ అధిష్టానానికి పరోక్షంగా వార్నింగిచ్చాడా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ పదవి ఇవ్వకపోతే తాను బీజేపీలోకి జంప్ జిలానీ అవుతానని చెప్పకనే చెప్పారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ అసలు విషయం వేరే వుంది. ప్రధానితో భేటీ అయిన భువనగిరి ఎంపీ… తానెందుకు మోదీని కల్సానో వెల్లడించారు. ముఖ్యంగా నాలుగంశాలపై మోదీతో భేటీ అయ్యానని చెప్పుకున్నారు వెంకటరెడ్డి. నాలుగు అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని మోదీని కోరినట్లు చెప్పారు. మొదట 3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ఫార్మా సిటీని 19 వేల 333 ఎకరాలకు పెంచారని, ఫార్మా సిటీ వల్ల హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయనంటున్నారు. ఎయిర్ పోర్టు దగ్గరలో ఫార్మా సిటీ రానివ్వం.. వేరే చోట పెట్టుకోవాలని సూచిస్తున్నాని వెంకటరెడ్డి అంటున్నారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలన్న మరో విఙ్ఞప్తిని మోదీ ముందుంచానని తెలిపిన భువనగిరి ఎంపీ.. మూసీ నది శుద్ది కోసం 3 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. కాపర్, జింక్ సహా అనే రసాయనాలు కలిసిన మూసీ నది.. తీవ్రస్థాయిలో కలుషితమైందని ఆయనంటున్నారు. సివరేజ్ ప్లాంట్ అవసరాన్ని ప్రధానికి వివరించానంటున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టాలని కూడా ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతో ప్రధానిని కల్వడం మంచిదే అయినా.. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉప్పు నిప్పు అన్నట్లున్న పరిస్థితిలో కల్వడం వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ద్విముఖ వ్యూహం వుందేమోనని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..