కోహ్లీ టీమ్‌ను.. పాక్ జట్టుతో పోల్చిన మంజ్రేకర్…

భారత మాజీ క్రికెటర్,  ఫేమస్ కామెంటేటర్ మంజ్రేకర్.. కోహ్లీ సేనపై ఊహించని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్‌ను పోలి ఉందని అభిప్రాయపడ్డాడు. కివీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్‌ చేసిన నేపథ్యంలో..విరాట్ టీమ్‌ను ఉద్దేశించి మంజ్రేకర ట్విట్టర్‌లో తన భావనను వెల్లిబుచ్చారు. India under Virat in NZ reminds me of Pakistan under Imran. Strong self belief as […]

కోహ్లీ టీమ్‌ను.. పాక్ జట్టుతో పోల్చిన మంజ్రేకర్...

భారత మాజీ క్రికెటర్,  ఫేమస్ కామెంటేటర్ మంజ్రేకర్.. కోహ్లీ సేనపై ఊహించని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్‌ను పోలి ఉందని అభిప్రాయపడ్డాడు. కివీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్‌ చేసిన నేపథ్యంలో..విరాట్ టీమ్‌ను ఉద్దేశించి మంజ్రేకర ట్విట్టర్‌లో తన భావనను వెల్లిబుచ్చారు.

“ప్రజంట్  కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ టీం.. ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్​ను గుర్తుచేస్తోంది. ఇమ్రాన్ సారథ్యం వహిస్తోన్న రోజుల్లో పాకిస్థాన్ టీమ్ ఓడిపోయే పరిస్థితుల నుంచి విజయాలు సాధించడానికి వివిధ మార్గాలు వెతికేది. అలా అనేక విక్టరీలు నమోదు చేసింది. సెల్ఫ్ కాన్పిడెన్స్‌తో అది సాధ్యం” అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై పాకిస్థాన్ అభిమానులు పాజిటీవ్‌గానే స్పందిస్తున్నారు. కానీ ఇండియన్ నెటిజన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. భారత టీం..ఆస్ట్రేలియా లేదా వెస్టిండీస్‌ జట్లతో పోల్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఆ రెండు టీమ్స్ ప్రపంచ క్రికెట్ హిస్టరీలో తమ మార్క్ చూపించాయని భారతీయులు అభిప్రాయం.

Published On - 9:09 am, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu