పోలీసు చట్ట సవరణపై కేరళ సర్కార్ వెనక్కు తగ్గింది. వివాదాస్పదంగా మారిన ‘కేరళ పోలీసు చట్ట’ సవరణ ఇప్పట్లో ఉండబోదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్త చట్టంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని ఇప్పుడే అమలు చేయబోమని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూలంకషంగా చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు చట్టానికి మార్పులు చేస్తున్నామని ప్రకటించగానే వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మా ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వర్గాల నుంచీ ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సవరించిన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం సరైన చర్య కాదని భావిస్తున్నాం. దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా చర్చిస్తాం. అన్ని పార్టీల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.
We have decided not to implement the amended Kerala Police Act. Detailed discussions will be held in the Legislative Assembly and further steps will be taken only after hearing the views of all parties.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) November 23, 2020
ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. పోలీసు చట్టంలో పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు భాగస్వామ్య పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో విజయన్ సర్కార్ కొత్త చట్టాన్ని ఉపసంహరించుకుంది. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం స్వేచ్ఛను కాలరాస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
కేరళ పోలీస్ చట్టంలో చేసిన మార్పులు ఒక్కసారి పరిశీలిస్తేః