న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో కన్నుమూసిన 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లలో ప్రదీప్ సింగ్ ఒకరు. అయితే ఆయన కుటుంబం ఇప్పుడు ప్రధాని మోడీపై జవాను కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. మోడీని నమ్మలేమని అన్నారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
గతంలో కూడా జవాన్లపై దాడి జరిగిందని, అప్పుడు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదని అడిగారు. ప్రదీప్ సింగ్ సోదరుడు మాట్లాడుతూ తమకు తమ సోదరుడి ప్రాణాలే ముఖ్యమని, ఎలాంటి నష్టపరిహారమూ తమకు ముఖ్యం కాదని అన్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఉండి ఉంటే ఇప్పుడు ప్రదీప్ సింగ్ తమకు మిగిలేవాడని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.