తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..

|

Mar 22, 2020 | 2:19 PM

Janata Curfew: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను భారతదేశంలో అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జనత కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ‘జయహో జనతా’ అంటూ కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి. ఈ కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశం మొత్తం కొనసాగానుండగా.. తెలంగాణలో మాత్రం జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించనున్నట్లు సిఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల […]

తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..
Follow us on

Janata Curfew: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను భారతదేశంలో అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జనత కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ‘జయహో జనతా’ అంటూ కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి. ఈ కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశం మొత్తం కొనసాగానుండగా.. తెలంగాణలో మాత్రం జనతా కర్ఫ్యూ 24 గంటల పాటు పాటించనున్నట్లు సిఎం కేసిఆర్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఇది కొనసాగనుంది.

మరోవైపు సాయంత్రం 5 గంటలకు ప్రజలందరూ ఇంటి బయటికి వచ్చి చప్పట్లతో అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితో పాటు డాక్టర్లకు సంఘీభావం తెలిపాలని పీఎం, సిఎంలు కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 63 వేల మంది పోలీసులు, 11 వేల మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోల్ బంకులకు ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వగా.. మిగిలిన అందరూ కూడా బంద్ పాటిస్తున్నారు.

కాగా, అంబులెన్స్‌లు, ఫైర్‌ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, అత్యవసర సేవల సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఇక అత్యవసర సేవల కోసం ప్రతి ఆర్టీసీ డిపోలో 5 బస్సులు సిద్ధంగా ఉండగా.. మెట్రో స్టేషన్లలో కూడా 5 మెట్రో రైళ్లను రెడీగా ఉంచారు.

For More News:

ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..

కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..

భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…

కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!

వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..