జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్ కోవిడ్ చికిత్సలనూ(కరోనా సోకిన తర్వాత తిరిగి పొందాల్సిన చికిత్స) సైతం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.

  • Updated On - 5:38 pm, Sat, 7 November 20
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

Jagan Government Good News: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోస్ట్ కోవిడ్ చికిత్సలనూ(కరోనా సోకిన తర్వాత తిరిగి పొందాల్సిన చికిత్స) సైతం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్ట్ కోవిడ్‌ చికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకోవాల్సిన ధరలను కూడా ఖరారు చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలను నిర్ణయించామని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.

Also Read: జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

కరోనా సోకిన రెండు వారాల తర్వాత కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు సాంత్వన కలిగించేందుకు సీఎం వైఎస్ జగన్ పోస్ట్ కోవిడ్ మేనేజ్‌మెంట్‌ స్కీంని ప్రవేశపెట్టారని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్యశ్రీ అనుబంధం ఆసుపత్రుల్లో దీనిని తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. గరిష్టంగా వారం పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే రోజుకు రూ. 2,930 చెల్లిస్తామని తెలిపారు. హెచ్‌ఆర్‌సీటీ రిపోర్టు అసాధారణంగా, ఆక్సిజన్ 94 శాతం కంటే తక్కువగా ఉంటే ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు ఆరోగ్యశ్రీ అనుమతిస్తుందన్నారు. కాగా, ఇప్పటికే జగన్ సర్కార్ కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన సంగతి విదితమే.

Also Read: పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..