రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు రూ. 12 లక్షలు ఫైన్ పడింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా అతడిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. (రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )
అబుదాబి వేదికగా మంగళవారం ముంబై, రాజస్థాన్ జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(79*) అదరగొట్టాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 136 పరుగులకే కుప్పకూలింది. బట్లర్(70) మినహా ఎవరూ పోరాడలేకపోయారు. రాజస్థాన్ జట్టును తన బౌలింగ్‌తో బుమ్రా(4/20) దెబ్బతీశాడు. (కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి, ఏపీకి వర్ష సూచన )