దేశంలో కరోనా.. 24 గంటల్లో 88,600 కేసులు, 1,124 మరణాలు..

|

Sep 27, 2020 | 11:02 AM

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 88,600 పాజిటివ్ కేసులు నమోదు కాగా

దేశంలో కరోనా.. 24 గంటల్లో 88,600 కేసులు, 1,124 మరణాలు..
Follow us on

Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 88,600 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,124 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,92,532కి చేరుకుంది. ఇందులో 9,56,402 యాక్టివ్ కేసులు ఉండగా.. 94,503 మంది కరోనాతో మరణించారు. అటు 49,41,627 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.

ఇదిలా ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ శాతం పెరుగుతూ ఉంది. నిన్న ఒక్క రోజు దేశవ్యాప్తంగా 92,043 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అత్యధిక పాజిటివ్ కేసుల లిస్టులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజులో 20,419 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 13 లక్షలు దాటింది. కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేట్ 15.96 శాతం, రికవరీ రేట్ 82.46 శాతంగా.. డెత్ రేట్ 1.58 శాతంగా ఉంది.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..

ఏపీలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!