Matire Ki Rad: పుచ్చకాయ కోసం రెండు రాజ్యాల మధ్య యుద్ధం..వేలాది సైనికులు మృతి.. ఏరులైపారిన రక్తం.. ఎక్కడంటే..

|

Apr 04, 2022 | 2:22 PM

భారతదేశ చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. రాజ్య విస్తరణ కోసం, అందమైన యువతల కోసం, సంపద కోసం ఇలా అనేక కారణాలతో రాజులు యుద్ధాలు చేసుకున్నారు. అయితే సుమారు 375 సంవత్సరాల క్రితం జరిగిన ఓ యుద్ధానికి చాలా విచిత్రమైన కారణం ఉంది. విచిత్రం ఎందుకంటే ఓ పుచ్చకాయ కోసం రెండు రాజ్యాలు భీకరంగా తలపడ్డాయి

1 / 5
భారతదేశ చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి.  రాజ్య విస్తరణ కోసం, అందమైన యువతల కోసం, సంపద కోసం ఇలా అనేక కారణాలతో రాజులు యుద్ధాలు చేసుకున్నారు. అయితే సుమారు 375 సంవత్సరాల క్రితం జరిగిన ఓ యుద్ధానికి చాలా విచిత్రమైన కారణం ఉంది. విచిత్రం ఎందుకంటే ఓ పుచ్చకాయ కోసం రెండు రాజ్యాలు భీకరంగా తలపడ్డాయి. ఈ భయంకరమైన యుద్ధంలో వేలాది మంది సైనికులు మరణించారు. ఇది చందమామ కథ కాదు.. వాస్తవంగా మనదేశంలో జరిగిందే.

2 / 5
ఒక్క పండు వల్ల జరిగిన యుద్ధంగా .. మనాదేశంలోనే కాదు..,ఏకంగా  ప్రపంచం చరిత్రలో నిలిచిపోయింది. ఈ యుద్ధాన్ని 'మతిరే కి రాడ్' అని పిలుస్తారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో..  పుచ్చకాయను మతిరా అని పిలుస్తారు. రాడ్ అంటే గొడవ.

3 / 5
క్రీ.శ.1644లో 'మతిరే కి రాడ్' అనే యుద్ధం జరిగింది.  చరిత్రలోకి వెళ్తే.. ఆ సమయంలో బికనీర్, నాగౌర్ రెండు రాజ్యాలుండేవి. బికనీర్ రాజ్యంలోని సిల్వా గ్రామం, నాగౌర్ రాష్ట్రంలోని జఖానియన్ గ్రామం ఒకదానికొకటి పక్కనే ఉండేవి.ఈ రెండు గ్రామాలు రెండు రాజ్యాలకు సరిహద్దు గ్రామాలు.అయితే  బికనీర్ సరిహద్దు గ్రామమైన  సిల్వా లో ఒక పుచ్చకాయ మొక్క పెరిగింది. అయితే ఒక పుచ్చకాయ నాగౌర్ రాజ్య సరిహద్దు గ్రామమైన జఖానియన్ లోకి వెళ్ళింది.

4 / 5
అయితే బికనీర్ ప్రజలు పుచ్చకాయ మొక్క తమ ప్రాంతంలో ఉంది కనుక ఆ పండు కూడా తమదేనని అన్నారు. అయితే నాగౌర్ రాష్ట్ర ప్రజలు పండు తమ పరిమితుల్లోకి వచ్చినప్పుడు అది తమదేనని చెప్పారు. దీంతో రెండు గ్రామాల గొడవ రాజ్యాల మధ్య వివాదంగా మారింది. క్రమంగా ఈ వివాదం రెండు రాజ్యాల మధ్య యుద్ధానికి దారితీసింది.

5 / 5
ఈ విచిత్రమైన యుద్ధంలో బికనీర్ సైన్యానికి రామచంద్ర ముఖియా నాయకత్వం వహించగా, నాగౌర్ సైన్యానికి సింఘ్వి సుఖ్‌మల్ నాయకత్వం వహించాడని స్థానికులు చెబుతారు. రెండు సంస్థాన రాజులకు అప్పటి వరకు పుచ్చకాయ గురించి జరుగుతున్న గొడవ ఏమీ తెలియనప్పటికీ, ఆ సమయంలో బికనీర్ పాలకుడు రాజా కరణ్ సింగ్ యాత్రలో ఉండగా, నాగౌర్ పాలకుడు రావు అమర్ సింగ్ మొఘల్ సేవలో ఉన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు రాజులు మొఘల్ రాజుల ఏలుబడిలో ఉన్నారు. రాజులిద్దరూ ఈ యుద్ధం గురించి తెలుసున్న తర్వాత .. మొఘల్ రాజులు జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే అప్పటికి చాలా ఆలస్యం అయింది. విషయం మొఘల్ కోర్టుకు చేరుకోకముందే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నాగౌర్ సంస్థానం ఓడిపోయినప్పటికీ, రెండు వైపులా వేలాది మంది సైనికులు మరణించారని ఇప్పటికీ అక్కడ స్థానికులు చెబుతారు.