Mohammed Siraj News: సిడ్నీ టెస్టులో సిరాజ్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి..

India Vs Australia 2020: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేసర్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు...

Mohammed Siraj News: సిడ్నీ టెస్టులో సిరాజ్ భావోద్వేగం.. జాతీయ గీతం ఆలపిస్తూ కంటతడి..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 6:04 PM

India Vs Australia 2020: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేసర్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. మ్యాచ్ ఆరంభంలో జాతీయ గీతాలాపన సందర్భంగా తన తండ్రి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల తండ్రిని కోల్పోయిన సిరాజ్.. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ స్థానంలో రెండో టెస్టుకు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతడికి మూడో టెస్టులో అవకాశం దక్కింది. దీనితో గురువారం మ్యాచ్ ప్రారంభమైన ఆరంభంలో కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రి కలను నెరవేర్చిన ఆనందం.. అది చూసేందుకు ఆయన తనతో లేకపోవడం సిరాజ్‌ను భావోద్వేగానికి గురి చేసింది. జాతీయ గీతం ఆలపించే సమయంలో ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకోలేకపోయాడు. రెండు చేతులతో కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. అది లైవ్‌లో కనిపించగా.. దానికి అభిమానులు సైతం విచారాన్ని వ్యక్తం చేశాడు.

ఇక ప్రస్తుతం ఈ మూడో టెస్టులో సిరాజ్.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(5) తక్కువ పరుగులకే పెవిలియన్ పంపించాడు. అంతేకాకుండా లైన్ అండ్ లెంగ్త్‌తో చక్కటి బంతులు వేస్తూ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. దీనితో మూడో టెస్టుకు కూడా సిరాజ్ కీలకం కానున్నాడు. కాగా, జాతీయ గీతాలాపన సందర్భంగా సిరాజ్ కంటతడి పెట్టడంపై కైఫ్ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశాడు. ”ఈ పిక్చర్‌ను అందరూ గుర్తించుకోవాలి. అతడే మహమ్మద్ సిరాజ్. అతనికి జాతీయ గీతం అంటే ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇదే నిదర్శనం”

Also Read:

మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!