మొదటి టీ20: ఓపెనర్‌గా రాహుల్.. శాంసన్‌కు మరోసారి దక్కని చోటు!

సొంతగడ్డపై కంగారూలను ఓడించి ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా నేటి నుంచి కివీస్‌తో తలబడనుంది. మూడు ఫార్మాట్ల సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం అంత సులభమేమి కాదు. టీ20ల్లో ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే. ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న కివీస్ జట్టు విసిరే సవాళ్లను కోహ్లీసేన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. గతంలో జరిగిన ఐదు సిరీస్‌ల్లో ఒకసారి […]

మొదటి టీ20: ఓపెనర్‌గా రాహుల్.. శాంసన్‌కు మరోసారి దక్కని చోటు!
Follow us

|

Updated on: Jan 24, 2020 | 10:22 AM

సొంతగడ్డపై కంగారూలను ఓడించి ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా నేటి నుంచి కివీస్‌తో తలబడనుంది. మూడు ఫార్మాట్ల సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం అంత సులభమేమి కాదు. టీ20ల్లో ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే. ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న కివీస్ జట్టు విసిరే సవాళ్లను కోహ్లీసేన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. గతంలో జరిగిన ఐదు సిరీస్‌ల్లో ఒకసారి పరిశీలిస్తే.. కేవలం ఒక్క దానిలో మాత్రమే ఇండియా విజయం సాధించడం గమనార్హం. ఇక ఈ రోజు మధ్యాహ్నం 12.20కు మొదలుకానున్న మొదటి టీ20 ఆక్లాండ్ వేదికగా జరగనుంది. ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.

ఇదిలా ఉంటే కోహ్లీ టీమిండియా తుది జట్టు కూర్పును ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించడమే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీని బట్టి చూస్తే రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అంతేకాకుండా మరో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించట్లేదు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కోహ్లీలు ఆడనుండగా.. శివమ్ దూబే ఆల్‌ రౌండర్ పాత్ర పోషించనున్నాడు.

భారత్ జట్టు(అంచనా): రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లి (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, శివమ్‌ దూబె, జడేజా/సుందర్‌, కుల్‌దీప్‌, షమి, సైని, బుమ్రా

కివీస్ జట్టు(అంచనా): గప్తిల్‌, మన్రో, సీఫెర్ట్‌, విలియమ్సన్‌ (విలియమ్సన్‌), రాస్‌ టేలర్‌, గ్రాండ్‌హోమ్‌/మిచెల్‌, శాంట్నర్‌, ఇష్‌ సోధి, సౌథీ, కుగెలీన్‌, బెనెట్‌

Latest Articles
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'