AP Weather: రాబోయే 3 రోజులు ఏపీలో వెదర్ ఎలా ఉంటుంది.. ఇదిగో రిపోర్ట్..

ఏపీలో నిన్నటి వరకు భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. వారం రోజులు పాటు నల్లటి మబ్బులు కమ్మి.. సూర్యుడే కనిపించలేదు. తాజాగా వరుణుడు కొంత తెరపి ఇచ్చాడు. రాబోయే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం....

AP Weather: రాబోయే 3 రోజులు ఏపీలో వెదర్ ఎలా ఉంటుంది.. ఇదిగో రిపోర్ట్..
Andhra Weather
Follow us

|

Updated on: Jul 26, 2024 | 3:06 PM

షియర్ జోన్ ఇప్పుడు భారతీయ ప్రాంతంపై సగటు సముద్ర మట్టం నకు 5.8 & 7.6 కి.మీ ఎత్తు మధ్య సుమారుగా 18° ఉత్తర అక్షాంశం వెంబడి వ్యాపించి, ఎత్తుకు వెళ్లే కొలదీ దక్షిణం వైపు వంగి ఉన్నది. మరోవైపు రుతుపవనాల ప్రభావం కూడా రాష్ట్రంపై బాగా ఉంది. ఈ క్రమంలో.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

శుక్రవారం, శనివారం:– తేలికపాటి నుండి మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

————————————–

శుక్రవారం, శనివారం, ఆదివారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

రాయలసీమ :-

—————-

శుక్రవారం, శనివారం, ఆదివారం:-  తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..