Telangana: రేపు ఒకే సమయంలో జాతీయ గీతం పాడేందుకు ఏర్పాట్లు.. ప్రతి ఒక్కరూ గీతాలాపన చేయాలని వినతి

|

Aug 15, 2022 | 4:19 PM

నగరంలో ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 11.30గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. అలారం మోగించే విధంగా మైక్‌ సిస్టమ్స్‌ ఏర్పాట్లను చేస్తున్నారు.

Telangana: రేపు ఒకే సమయంలో జాతీయ గీతం పాడేందుకు ఏర్పాట్లు.. ప్రతి ఒక్కరూ గీతాలాపన చేయాలని వినతి
National Anthem
Follow us on

Telangana:  స్వాతంత్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం (ఆగష్టు 16) ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయ గీతం పాడేందుకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ సామూహిక జాతీయగీతాలాన కార్యక్రమంలో నగరంలోని అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ గీతలపలో  సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సీఎం కెసిఆర్ తో పాటు  మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపనలో నగర వాసులందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. ఆ సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన చేయాలని వినతిచేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన..ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లలో ఒక్కచోట సామూహికంగా జాతీయ గీతాన్ని అలాపించి దేశ భక్తిని చాటాలన్నారు.

అంతేకాదు నగరంలో ట్రాఫిక్ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 11.30గంటలకు ట్రాఫిక్‌ను నిలిపివేసి.. అలారం మోగించే విధంగా మైక్‌ సిస్టమ్స్‌ ఏర్పాట్లను చేస్తున్నారు. జాతీయ గీతాలాపన సమయంలో క్రమశిక్షణ పాటించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..