Hookah party: పేరుకు బర్త్‌డే పార్టీ.. కానీ అసలు జరిగిందేంటంటే…

Hookah party: పక్కా సమాచారంతో పోలీసులు హిమాయత్ సాగర్ దగ్గర ఓ ఫాం హౌస్‌పై దాడి చేశారు. అక్కడ పైకి కనిపిస్తున్నది బర్త్ డే పార్టీ. లోపల జరుగుతున్నది హుక్కా పార్టీ. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా… శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. హుక్కాలో అడ్డమైన మత్తు పదార్థాలు కలుపుకొని… ఆహా ఓహో అంటూ తెగ పీల్చేస్తున్నారు. కాగా.. పోలీసులు చేరుకోగానే నలుగురు కుర్రాళ్లు అదే పనిలో ఉన్నారు. రేయ్… ఏంట్రా ఇది… అంటే… […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:49 pm, Fri, 21 February 20
Hookah party: పేరుకు బర్త్‌డే పార్టీ.. కానీ అసలు జరిగిందేంటంటే...

Hookah party: పక్కా సమాచారంతో పోలీసులు హిమాయత్ సాగర్ దగ్గర ఓ ఫాం హౌస్‌పై దాడి చేశారు. అక్కడ పైకి కనిపిస్తున్నది బర్త్ డే పార్టీ. లోపల జరుగుతున్నది హుక్కా పార్టీ. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా… శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది. హుక్కాలో అడ్డమైన మత్తు పదార్థాలు కలుపుకొని… ఆహా ఓహో అంటూ తెగ పీల్చేస్తున్నారు.

కాగా.. పోలీసులు చేరుకోగానే నలుగురు కుర్రాళ్లు అదే పనిలో ఉన్నారు. రేయ్… ఏంట్రా ఇది… అంటే… హుక్కా అనేసి… లేదు లేదు సార్… ఇది బీర్… కాదు కాదు సార్… ఇది… అంటూ ఏదేదో చెబుతుంటే… అర్థమైంది… అంటూ పోలీసులు నలుగుర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురూ… హైదరాబాద్‌కి చెందిన వారే. వాళ్లను లోతుగా ప్రశ్నించేందుకు, ఆ ఫార్మాల్టీలు పూర్తి చేసేందుకు వాళ్లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు.