పెన్నానది ఉగ్రరూపం..లోతట్టుప్రాంతాలు జలమయం

నెల్లూరు జిల్లాలో పెన్నానది ఉగ్రరూపం దాలుస్తోంది. జిల్లాలోని సోమశిల జలాశయం వరదనీటితో పూర్తి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమశిల జలాశయం నుంచి పెన్నాకు విడుదల అవుతున్న నీరు ఆదివారం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమశిల జలాశయానికి ఇప్పటికే 1.42 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో జలాశయం లోని 12 గేట్లను […]

పెన్నానది ఉగ్రరూపం..లోతట్టుప్రాంతాలు జలమయం
Follow us

|

Updated on: Sep 20, 2020 | 4:13 PM

నెల్లూరు జిల్లాలో పెన్నానది ఉగ్రరూపం దాలుస్తోంది. జిల్లాలోని సోమశిల జలాశయం వరదనీటితో పూర్తి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమశిల జలాశయం నుంచి పెన్నాకు విడుదల అవుతున్న నీరు ఆదివారం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమశిల జలాశయానికి ఇప్పటికే 1.42 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో జలాశయం లోని 12 గేట్లను ఎత్తి 1.56 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. ఈ సాయంత్రానికి మరో యాభై వేల క్యూసెక్కులను కలిపి 2 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నాకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ముంపు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా మంత్రి గౌతమ్ రెడ్డి సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ముంపు వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..