1993 రికార్డును బద్దలు కొట్టిన ‘గుజరాత్ అసెంబ్లీ’

గుజరాత్ అసెంబ్లీ 1993 రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకధాటిగా 12 గంటల తొమ్మిది నిమిషాలు సభను నడిపించారు స్పీకర్ రాజేంద్ర త్రివేదీ. స్పీకర్ ఈ రికార్డును ప్రకటించగానే అధికారులతో సహా, ఎమ్మెల్యేలందరూ హర్షాతిరేకాలు సమర్పించారు. ‘‘గుజరాత్ అసెంబ్లీ ఏకధాటిగా 12 గంటల తొమ్మిది నిమిషాలు సభా వ్యవహారాలు నడిపి, జనవరి 6, 1993 రికార్డును బద్దలు కొట్టింది’’ అని అసెంబ్లీ అధికారులు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. 1993 జనవరి 6 న […]

1993 రికార్డును బద్దలు కొట్టిన 'గుజరాత్ అసెంబ్లీ'
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 10:55 PM

గుజరాత్ అసెంబ్లీ 1993 రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకధాటిగా 12 గంటల తొమ్మిది నిమిషాలు సభను నడిపించారు స్పీకర్ రాజేంద్ర త్రివేదీ. స్పీకర్ ఈ రికార్డును ప్రకటించగానే అధికారులతో సహా, ఎమ్మెల్యేలందరూ హర్షాతిరేకాలు సమర్పించారు. ‘‘గుజరాత్ అసెంబ్లీ ఏకధాటిగా 12 గంటల తొమ్మిది నిమిషాలు సభా వ్యవహారాలు నడిపి, జనవరి 6, 1993 రికార్డును బద్దలు కొట్టింది’’ అని అసెంబ్లీ అధికారులు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. 1993 జనవరి 6 న జరిగిన అసెంబ్లీ 12 గంటల ఎనిమిది నిమిషాలు కొనసాగి అప్పట్లో రికార్డు సృష్టించింది.