కోవిద్ పై పోరు ఉధృతం…..దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ ప్రారంభం……అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ ..

| Edited By: Anil kumar poka

Jun 21, 2021 | 11:11 AM

కోవిద్ పై పోరును ప్రభుత్వం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు..అంతకన్నా వయస్సు పైబడినవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కోవిద్ పై పోరు ఉధృతం.....దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్  ప్రారంభం......అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ ..
Covid Vaccine
Follow us on

కోవిద్ పై పోరును ప్రభుత్వం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ళు..అంతకన్నా వయస్సు పైబడినవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా ఈ డ్రైవ్ చేపట్టినట్టు కనిపిస్తోంది. జూన్ 21 నుంచి ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రధాని మోదీ ఈ నెల 7 న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వాటి వాటి జనాభాను, కోవిద్ కేసులను, వ్యాక్సినేషన్ లో జరిగిన పురోగతిని బట్టి వీటికి టీకామందుల డోసులను కేటాయించినట్టు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ప్రజలంతా ఫ్రీగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని, అలాగే సొమ్ము చెల్లించగలవారు ప్రైవేటు హాస్పిటల్స్, వ్యాక్సిన్ కేంద్రాల్లో దీన్ని తీసుకోవచ్చునని కేంద్రం తన గైడ్ లైన్స్ లో వివరించింది. ప్రైవేటు హాస్పిటల్స్ లో కోవీషీల్డ్ కి డోసు 780 రూపాయలు, కోవాగ్జిన్ కి రూ. 1410, స్పుత్నిక్ వ్యాక్సిన్ కి రూ. 1145 గా నిర్ణయించారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లు ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అటు-కోవిన్ పై ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధన తప్పనిసరి కాదని కూడా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది. సోమవారం నుంచి ఈ డ్రైవ్ ని విస్తృతంగా చేపడుతున్నందువల్ల ఇక కోవిద్ కేసులు ఇంకా చాలావరకు తగ్గవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు తగ్గిన కారణంగా అన్-లాక్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసుల దృష్ట్యా ఆంక్షలను పొడిగిస్తున్నారు. మరో వైపు థర్డ్ వేవ్ ముప్పు కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.\

మరిన్ని ఇక్కడ చూడండి: Vishal’s movie shooting Video: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.వైరల్ వీడియో.

 Harish Rao Met With Road Accident Video: హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం పలువురికి గాయాలు..మంత్రి వాహనానికి అడవి పంది అడ్డు.

 Telangana : స్కూల్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్, పేరెంట్స్ లో థర్డ్ వేవ్ టెన్షన్.. HSPA అభిప్రాయం వెల్లడి.

Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.