కోవిడ్ వ్యాక్సీన్ తొలి డోసు పని చేయకపోవచ్చు, బ్రిటన్ టాస్క్ ఫోర్స్

కోవిడ్-19 వ్యాక్సీన్లలో మొదటి తరం (తొలి డోసు) సమర్థంగా పని చేయకపోవచ్చునని   బ్రిటన్ వ్యాక్సీన్  టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్ కేట్ బింగ్ హామ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికీ ఇది పని చేయకపోవచ్చునని భావిస్తున్నామని ఆమె అన్నారు.

కోవిడ్ వ్యాక్సీన్ తొలి డోసు పని చేయకపోవచ్చు, బ్రిటన్ టాస్క్ ఫోర్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 28, 2020 | 1:49 PM

కోవిడ్-19 వ్యాక్సీన్లలో మొదటి తరం (తొలి డోసు) సమర్థంగా పని చేయకపోవచ్చునని   బ్రిటన్ వ్యాక్సీన్  టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్ కేట్ బింగ్ హామ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికీ ఇది పని చేయకపోవచ్చునని భావిస్తున్నామని ఆమె అన్నారు. మొదట ఉత్పత్తి అయ్యే ఈ టీకామందు మీద మరీ ‘ఆశావాదం’ కూడా అంతగా వద్దని ‘చల్లని కబురు’  చల్లగా చెప్పారు.   అసలు వ్యాక్సీన్ వస్తుందా, రాదా అన్నది కూడా తెలియడంలేదని లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ఆవిడ ఓ వ్యాసం రాశారు. తొలి డోసు వ్యాక్సీన్ ఇన్ఫెక్షన్ ని నివారించలేకపొవచ్చునని,  అయినా ప్రతివారికీ అది చాలాకాలం పాటు పని చేస్తుందా అన్నది అనుమానమేనని ఆమె పేర్కొన్నారు. నిజానికి కొన్ని కోటానుకోట్ల డోసుల వ్యాక్సీన్ అవసరమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాలకు ఈ డోసులు సరిపోతాయని చెప్పలేం అని కేట్ అన్నారు. తమ దేశంలో కోవిడ్ టీకామందు  ఉత్పాదక సామర్ధ్యం ఇప్పటివరకు కాస్త ఆందోళనకరంగా ఉందన్నారు.

ఇక లండన్ ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి..బిటిష్ ప్రజల్లో ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో కోవిడ్ పై పోరు జరిపే యాంటీ బాడీలు చాలావరకు తగ్గిపోయాయన్నారు. ఇందుకు నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం అన్నారు. ఇక మొదటి వైరస్ కన్నా రెండో కరోనా వైరస్ వేవ్ చాలా డేంజర్ అని బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తోందని టెలిగ్రాఫ్ డైలీ పేర్కొంది. ఏతావాతా..వీళ్ళు చెప్పేదంతా చూస్తుంటే అసలు కరోనా భయం కన్నా ఇలాంటి భయాలే జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏదో వ్యాక్సీన్ వస్తుందని, కరోనాను ఎదిరించవచ్చునని ఆశాభావంతో ఉంటే ఆ ఆశలపై వీళ్ళు నీళ్లు చల్లుతున్నట్టే ఉంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు