ఈడీ, సీబీఐ సంస్థలను సరిహద్దులకు పంపాల్సిందే ! బీజేపీపై ‘శివమెత్తిన’ శివసేన, ‘సామ్నా’ లో ఫైర్

జమ్మూ కాశ్మీర్ లోకి టెర్రరిస్టుల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). సీబీఐ దర్యాప్తు సంస్థలను సరిహద్దులకు తరలించాల్సిందేనని శివసేన వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో..

ఈడీ, సీబీఐ సంస్థలను సరిహద్దులకు పంపాల్సిందే ! బీజేపీపై 'శివమెత్తిన' శివసేన, 'సామ్నా' లో ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 30, 2020 | 4:43 PM

జమ్మూ కాశ్మీర్ లోకి టెర్రరిస్టుల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). సీబీఐ దర్యాప్తు సంస్థలను సరిహద్దులకు తరలించాల్సిందేనని శివసేన వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కక్ష తీర్చుకునేందుకు, వాటిని వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సంస్థలను వినియోగించుకుంటోందని సేన తన ‘సామ్నా’ పత్రిక ఎడిటోరియల్ లో ఆరోపించింది. ఈ దర్యాప్తు సంస్థలు తమ ‘సత్తా’ను చాటుకోవాలంటే వీటిని బోర్డర్స్ కి పంపాలని ‘సూచించింది’.  ఎల్లప్పుడూ తుపాకీ తూటాలు పని చేయబోవని, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను టెర్రరిస్టులుగా ముద్ర వేస్తున్నప్పుడు..కాశ్మీర్ లో ఎంటరవుతున్న ఉగ్రవాదుల పని పట్టేందుకు వీటిని మాత్రం ఎందుకు పంపరాదని శివసేన ప్రశ్నించింది.

ఈ దేశ శాంతియుత పరిస్థితిని బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది..ముగిసిపోయిన ఖలిస్థాన్ టాపిక్ ని మళ్ళీ లేవనెత్తుతోంది..ఇది దేశానికి తిరిగి చేటు తెస్తుంది అని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. నాడు బ్రిటిష్ హయాంలో రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన అప్పటి తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఏనాడూ హింసాత్మక పంథాను అనుసరించలేదని, కానీఇప్పుడు ఈ దేశంలో రైతుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని చూసి  గుజరాత్ లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఆయన విగ్రహం కన్నీరు కారుస్తుందని శివసేన పేర్కొంది.