రష్యా టూర్ ముగిసింది, ఇరాన్ బయల్దేరిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

రష్యాలోమూడు రోజుల పర్యటన ముగించుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇరాన్ బయల్దేరారు. ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ బ్రిగేడియర్ జనరల్ అమిర్ హటామీతో ఆయన భేటీ అవుతారు. రష్యానుంచి..

రష్యా టూర్ ముగిసింది, ఇరాన్ బయల్దేరిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 05, 2020 | 7:58 PM

రష్యాలోమూడు రోజుల పర్యటన ముగించుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇరాన్ బయల్దేరారు. ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ బ్రిగేడియర్ జనరల్ అమిర్ హటామీతో ఆయన భేటీ అవుతారు. రష్యానుంచి బయల్దేరే ముందు ఆయన… గల్ఫ్ దేశాలు తమ మధ్య తలెత్తిన విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. ఇరాన్, యూఏఈ దేశాల మధ్య ఏర్పడిన వివాదాలు శాంతికి దోహదం చేయబోవని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో ఇరాన్ నేవీ…. లైబీరియా ట్యాంకర్ ను సీజ్ చేయడంతో ఇదే అదనుగా అమెరికా ఇరాన్ పై మండిపడింది.  ఈ విషయాన్ని కూడా రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. గల్ఫ్ దేశాల మధ్య సామరస్యం ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Articles