త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి భేటీ

భారత్ - చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి భేటీ
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 6:58 PM

భారత్ – చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (CDS) జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భూసరిహద్దుతో పాటు వాయు, నేవీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్‌ ఆదేశించారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను పెంచుతూ చైనా కార్యకలాపాలపై నిఘా పెట్టాలని సైనికాధికారులకు కేంద్రమంత్రికి సూచించినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు వెలువడుతున్న వార్తల నేఫథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

గల్వాన్‌ వ్యాలీ ఘటనతో దేశంలో చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేయాలని ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. అటు ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించి, డ్రాగన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలంటూ పలువురు నేతలు సైతం కోరుతున్నారు.

Latest Articles