ఏపీ అసెంబ్లీ సెషన్‌పై చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు

|

Nov 03, 2020 | 5:45 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమావేశాలను ఎప్పుడు నిర్వహించేది వెల్లడించారు. అయితే.. సమావేశాల నిర్వహణకున్న గడువు గురించి కూడా ఆయన మాట్లాడడం ఆసక్తి రేపుతోంది.

ఏపీ అసెంబ్లీ సెషన్‌పై చీఫ్ విప్ కీలక వ్యాఖ్యలు
Follow us on

Crucial statement on AP assembly session: దీపావళి పండుగ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. డిసెంబర్ 14వ తేదీ వరకు సభ నిర్వహణకు గడువు వుండగా.. దీపావళి తర్వాత సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్దమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీ. శ్రీకాంత్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. నవంబర్ చివరి వారంలోగానీ.. డిసెంబర్ మొదటి వారంలోగానీ అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారాయన.

‘‘ దీపావళి తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి.. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటివారంలో సమావేశాలు ఉంటాయి.. నిజానికి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు డిసెంబర్ 14 వరకు సమయం ఉంది.. వీలైనన్ని ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నాం.. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాం.. ’’ అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం పూర్తి అయ్యేదా? సచ్చేదా? అని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారని, కమిషన్ల కోసం కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని శ్రీకాంత్ రెడ్డి విపక్ష నేతపై ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ విధానంతో నిధులను ఆదా చేయడాన్ని కూడా టీడీపీ తప్పు పట్టడం విడ్డూరంగా వుందని ఆయన ఎద్దేవా చేశారు.

ALSO READ: సీఎంను తిట్టినందుకు ఆరు రోజుల కస్టడీ

ALSO READ: ఈడీ చరిత్రలో భారీ జరిమానా

ALSO READ: అమితాబ్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదు

ALSO READ: భూమా ఫ్యామిలీలో భగ్గుమన్న విభేదాలు

ALSO READ: కల్లు ప్రియులకు షాకింగ్ న్యూస్