ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. కరోనా ట్రీట్‌మెంట్..!

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా.. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే కరోనా

ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. కరోనా ట్రీట్‌మెంట్..!
Follow us

| Edited By:

Updated on: May 18, 2020 | 11:28 AM

Private hospitals in Telangana: కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా.. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే కరోనా ట్రీట్ మెంట్ ను పరిమితం చేయగా.. ప్రయివేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా పేషేంట్లకు వైద్యసేవలు అందించగా.. ప్రభుత్వం దానిపై సీరియస్ అవడంతో.. సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో సహా, పలు కారణాలతో ప్రయివేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు అనుమతించడం జరిగింది.

ఈ నేపథ్యంలో.. ప్రయివేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు అనుమతిస్తూ.. వైద్య సేవల పరంగా ఆస్పత్రులను మూడు కేటగిరీలుగా విభజించింది. ప్రైవేటు క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు మొదటి కేటగిరీ కాగా, రెండోది ఇన్‌పేషంట్‌ సౌకర్యం లేని నర్సింగ్‌ హోమ్‌లు, మూడోది ఐసీయూ, వెంటిలేటర్ల సౌకర్యం ఉండి కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రులు. ఈ ఆస్పత్రులు పాటించాల్సిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

Also Read: బ్రేకింగ్: లాక్‌డౌన్ ను మరోసారి పొడిగించిన ఏపీ..