కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ‘ప్లేబాయ్’ మ్యాగజైన్ బంద్..

|

Mar 21, 2020 | 3:18 PM

Coronavirus Impact: ‘ప్లేబాయ్’ మ్యాగజైన్.. రసికప్రియులకు ఇది పరిచయం అక్కర్లేని పత్రిక. 1960లో అమెరికాలో ప్రారంభమైన ఈ పత్రిక అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుర్రకారును విపరీతంగా ఆకర్షించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఇక 1970లో ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా డిజిటల్ పత్రికగానూ వినియోగదారులకు సేవలందించింది. మరోవైపు ఈ పత్రిక ముఖచిత్రంపై తమ ఫోటో ఒక్కసారైనా పడాలని ఆరాటపడే హాలీవుడ్ తారలు ఎందరో ఉన్నారు. దీని వల్ల చాలామంది నటీమణులు […]

కరోనావైరస్: రసికప్రియులకు బ్యాడ్ న్యూస్.. ప్లేబాయ్ మ్యాగజైన్ బంద్..
Follow us on

Coronavirus Impact: ‘ప్లేబాయ్’ మ్యాగజైన్.. రసికప్రియులకు ఇది పరిచయం అక్కర్లేని పత్రిక. 1960లో అమెరికాలో ప్రారంభమైన ఈ పత్రిక అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుర్రకారును విపరీతంగా ఆకర్షించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. ఇక 1970లో ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా డిజిటల్ పత్రికగానూ వినియోగదారులకు సేవలందించింది.

మరోవైపు ఈ పత్రిక ముఖచిత్రంపై తమ ఫోటో ఒక్కసారైనా పడాలని ఆరాటపడే హాలీవుడ్ తారలు ఎందరో ఉన్నారు. దీని వల్ల చాలామంది నటీమణులు పాపులారిటీ పొందారు. అంతటి పేరుగాంచిన ఈ సంస్థకు కరోనా దెబ్బ తగిలింది. కోవిడ్ 19 కారణంగా ఈ పత్రికకు పని చేసే క్రియేటివ్ ఎడిటర్లు అందుబాటులో ఉండరని భావించిన యాజమాన్యం చివరి ఎడిషన్‌ను ప్రచురించి వీడ్కోలు పలికింది. ఇక ఆ తర్వాత కేవలం ప్రత్యేక ఎడిషన్లు మాత్రమే ప్రింట్ చేయాలని యోచిస్తున్నారు.

ఈ విషయంపై ప్లేబాయ్ సీఈవో బెన్ కాన్ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా డిజిటల్ కంటెంట్ ద్వారానే వినియోగదారులకు సరికొత్త కథనాలను అందిస్తామని.. కేవలం ప్లేబాయ్ ఎడిషన్లను ప్రచురణను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనితో రసికప్రియుల గుండెల్లో పదునైన బాణాలు దిగాయనే చెప్పాలి.

For More News:

డేంజర్ బెల్స్: తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు…

కరోనా ఎఫెక్ట్.. పెన్షన్ల పంపణీపై జగన్ కీలక నిర్ణయం..

కరోనా భయం.. పీఎస్‌లో గోదావరి కుర్రాడు..

కరోనా వైరస్.. వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్లు..

కరోనా ప్రభావం.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్…

Breaking.. బస్సులు, మెట్రో బంద్..

డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. ఎబోలా కంటే ప్రమాదకర స్థాయికి..

‘ఈరోస్ నౌ’ బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సినిమాలు…

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్