
Corona Vaccine Dry Run : దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం అయ్యింది. కొవిన్ సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు డ్రై రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలోనూ వ్యాక్సినేషన్ డ్రై రన్ చేపట్టారు.
ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ డ్రై రన్లో భాగంగా ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. డ్రై రన్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ చేపట్టింది. 116 జిల్లాల్లోని 259 ప్రాంతాల్లో శనివారం ఉదయం డ్రై రన్ ప్రారంభమైంది. ఈ డ్రై రన్ ద్వారా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును పరిశీలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నారు. మండల, బ్లాక్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలు, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు కొవిన్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు.
వ్యాక్సిన్ డ్రై రన్లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇస్తారు.
ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉంటారు.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్లైన్లో రికార్డు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో ఉండే సమస్యలను గుర్తించి పరిష్కరించి… అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రైరన్ ప్రధాన టార్గెట్. అయితే డ్రైరన్‌లో ఎక్కడా వ్యాక్సిన్ ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్‌గా మాత్రమే చేస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్లో అధికారులు పొందుపరచనున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా డ్రైరన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మణిపూర్‌లో నిర్ణయించిన కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ డ్రైరన్ జరుగుతోంది. డ్రైరన్‌లో పాల్గొనే 25మంది సమాచారాన్ని ఇప్పటికే టీకా ఆప్‌లో నిక్షిప్తం చేసి ఉంచారు. డ్రైరన్‌ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సహా… కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే బృందాలు పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ దర్యాగంజ్‌లోని టీకా కేంద్రాన్ని సందర్శించి టీకా డ్రై రన్‌ను సమీక్షించారు. ఈ సమయంలో కరోనా వ్యాక్సిన్‌ను ఢిల్లీలో ఎలాగైనా ఉచితంగా అందిస్తుని తెలిపారు.
కరోనా మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి దేశంలో ముందడుగు పడిన వేళ ఇవాళ టీకా డ్రైవ్ రన్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ ఈ ఉదయం ప్రారంభమైంది. టీకా పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును ఈ డ్రైరన్ లో అధికారులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు.
కేరళలో డ్రై రన్ కొనసాగుతోంది. టీకా ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి, సాంకేతిక సమస్యలను పరిశీలిస్తారు. కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలోనే వ్యాక్సినేటర్లను ఉంచి… టీకా ఇచ్చిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులను గుర్తించి.. కొవిన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం మొదలైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 2 జిల్లాల్లో ప్రక్రియ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో 4, మహబూబ్‌నగర్‌లో 3 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డ్రై రన్ నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ ఇస్తారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ విశాఖలో ప్రారంభమైంది. విశాఖలో.. పలు ఆసుపత్రులతో పాటు సింహాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డ్రైరన్‌ను నిర్వహింస్తున్నారు. సుమారుగా రెండు గంటల పాటు ఈ డ్రై రన్ కొనసాగనుంది. ఎంపిక చేసిన అభ్యర్థులు.. సుమారు 25 మందితో ఈ రోజు డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వాటిలో ఎదురయ్యే సవాళ్లను ఇబ్బందులను ఆరోగ్యశాఖకి పంపించనున్నారు.
కరోనా వ్యాక్సిన్ డ్రై రన్లో భాగంగా ఢిల్లీలోని జీటీబీ(GTB ) ఆసుపత్రిని సందర్శించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. డ్రై రన్ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు.
డ్రై రన్ దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు.
2గంటల వ్యవధిలో 25 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు టైం శ్లాట్ ఇవ్వాలి. ఒకటవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ లబ్ధిదారుల పేర్లు, అడ్ర్‌సలు, వివరాలు పరిశీలిస్తారు. రెండవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ కొవిన్ వెబ్సైట్లో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తారు. అనంతరం డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు కొవిన్‌లో రిపోర్టు చేస్తారు. మూడవ వ్యాక్సినేషన్ ఆఫీసర్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తారు. వ్యాక్సిన్ పొందినవారు 30 నిమిషాల పాటు విశ్రాంతి గదిలో వేచి ఉండాలి. ఈ విధంగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఈ ఉదయం 9 గంటలకు కొవిడ్ టీకా డ్రై రన్ ప్రారంభంకానుంది. ఒక్కో జిల్లాలో మూడు చోట్ల కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఇక తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు.
అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల అమలును… డ్రైరన్‌లో తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు, ఆరడుగుల దూరాన్ని అందరూ పాటించాల్సిందే. ప్రతి కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్… శానిటైజర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లోని పురపాలక, నగరపాలక సంస్థల్లోని ప్రజారోగ్య విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి కరోనా టీకా ఇచ్చేందుకు వారి పూర్తి వివరాలు సిద్ధం చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ రాష్ట్ర పురపాలకశాఖను ఆదేశించింది. ‘కొవిన్’ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఈనెల 4లోగా అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది. కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ అన్ని రాష్ట్రాల పురపాలకశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజారోగ్య విభాగంలో సేవలు అందిస్తున్న సిబ్బందికి టీకాఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేశారు.
తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ప్రతి జిల్లాలోని మూడు ప్రదేశాల్లో డ్రై రన్ నిర్వహించేందుకు 39 ప్రదేశాలను గుర్తించారు. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వాసుపత్రి, ఒక ప్రైవేటు ఆస్పత్రితోపాటు గ్రామాల్లోని ‘కామన్ ప్రదేశం’లో డ్రై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ లబ్ధిదారులను ముందుగానే గుర్తించి కొవిన్ వెబ్సైట్లో పొందుపరిచారు.