‘కొవాగ్జిన్’ టీకా వచ్చేది అప్పుడే.. భారత్ బయోటెక్ క్లారిటీ..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)లతో కలిసి భారత్ బయోటెక్ దేశీయ కరోనా వ్యాక్సిన్ 'కొవాగ్జిన్'ను

'కొవాగ్జిన్' టీకా వచ్చేది అప్పుడే.. భారత్ బయోటెక్ క్లారిటీ..
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2020 | 6:01 PM

Corona Vaccine: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)లతో కలిసి భారత్ బయోటెక్ దేశీయ కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టీకాకు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ సాయి ప్రసాద్ ‘కొవాగ్జిన్’ టీకా విడుదలపై కీలక విషయాలు వెల్లడించారు.

వ్యాక్సిన్ సమర్ధత, భద్రతపై చివరి దశ క్లినికల్ ట్రయిల్స్‌లో స్పష్టత వచ్చి.. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతే ‘కొవాగ్జిన్’ను విడుదల చేస్తామని ఆయన అన్నారు. దాదాపుగా 2021 మార్చి తర్వాత దీన్ని రిలీజ్ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయిల్స్‌పైనే దృష్టి పెట్టామని.. దేశంలోని 13-14 రాష్ట్రాల్లో ట్రయిల్స్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా, వ్యాక్సిన్ డోసు ధరపై తుది నిర్ణయం తీసుకోలేదని భారత్ బయోటెక్ పేర్కొంది.

Also Read:

వైసీపీ సంచలన నిర్ణయం.. నవంబర్ 6 నుంచి ఏపీ వ్యాప్తంగా…

ఏపీలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు.. మార్గదర్శకాలు ఇవే..

ఏపీలో పింఛన్‌దారులకు శుభవార్త..

ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..