హిందూ మతాన్ని కించపరచలేదు.. ఆ వ్యాఖ్యలు చిన్నారివే.!

|

May 09, 2020 | 3:12 PM

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. తమిళ ఇండస్ట్రీలో ఈయనకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా సమాచారం ప్రకారం సేతుపతిపై కేసు నమోదైంది. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అఖిల భారత హిందూ మహా సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది మార్చి 17న జరిగిన ‘నమ్మ ఓరు హీరో’ అనే టాక్ […]

హిందూ మతాన్ని కించపరచలేదు.. ఆ వ్యాఖ్యలు చిన్నారివే.!
Follow us on

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. తమిళ ఇండస్ట్రీలో ఈయనకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా సమాచారం ప్రకారం సేతుపతిపై కేసు నమోదైంది. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై అఖిల భారత హిందూ మహా సభ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత ఏడాది మార్చి 17న జరిగిన ‘నమ్మ ఓరు హీరో’ అనే టాక్ షో ఎపిసోడ్‌కు విజయ్ సేతుపతి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ‘దేవాలయాలలోని పూజారులు దేవుళ్లకు అభిషేకం చేస్తునప్పుడు భక్తులకు విగ్రహాలను చూపిస్తారని.. అలంకరణ వేళలో మాత్రం వాటిని చూపించరని అన్నారు. యధాలాపంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయని ఆరోపించింది.

అయితే ఈ వ్యాఖ్యలు తాను చేయడానికి గల కారణాన్ని కూడా విజయ్ సేతుపతి ఆ సమయంలో వివరించాడు. ఇవి తాను సొంతంగా చేసిన కామెంట్స్ కాదని.. ఒక చిన్నారి తన తాతయ్యను అమాయకంగా అలా అడిగిందని తెలిపారు. కానీ ఈ వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ తీవ్రంగా తప్పుబట్టింది. ‘సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా.? అంటూ విమర్శించింది. మరి ఈ వివాదంపై సేతుపతి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read More:

గ్యాస్ లీకేజ్ ఘటన.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

గుజరాత్‌కు ‘కరోనా’ అప్పుడే వచ్చిందట… కానీ అది వైరస్ కాదట..

అక్కడ బార్లకు, రెస్టారెంట్లకు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. మసీదుల్లో ప్రార్ధనలకు అనుమతి!