ప్లాట్ల పేరిట చీటింగ్… స్టేషన్ బెయిల్‌తో ఇంటికి!

|

Oct 18, 2020 | 6:24 PM

ఇళ్ళ స్థలాల పేరిట మోసం చేసిన ఓ చీటర్‌ను పోలీసులు స్టేషన్ బెయిల్‌తో సరిపెట్టి ఇంటికి పంపిన వైనం హైదరాబాద్ మహానగరంలో జరిగింది. వన సంరక్షణ సేవా సమితి పేరిట ఓ మోసగాడు...

ప్లాట్ల పేరిట చీటింగ్... స్టేషన్ బెయిల్‌తో ఇంటికి!
Follow us on

Cheating in the name of Housing plots: ఇళ్ళ స్థలాల పేరిట మోసం చేసిన ఓ చీటర్‌ను పోలీసులు స్టేషన్ బెయిల్‌తో సరిపెట్టి ఇంటికి పంపిన వైనం హైదరాబాద్ మహానగరంలో జరిగింది. వన సంరక్షణ సేవా సమితి పేరిట ప్రముఖులతో పరిచయాలున్నాయంటూ… ఈజీగా ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన మోసగాడిని ఓ బాధితుని ఫిర్యాుద మేరకు పోలీసులు అరెస్టు చేశారు. కానీ అంతలోనే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి సాగనంపారు.

హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లస్థలాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఉదంతమిది. తెలంగాణ వన సంరక్షణ సేవాసమితి పేరుతో చీటింగ్ చేశాడు ఓ మోసగాడు. ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ దాదాపు 50 మంది దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశాడీ అక్రమార్కుడు. ఇళ్ళస్థలాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని ఆ తర్వాత తప్పించుకు తిరుగుతున్న సదరు వ్యక్తిపై సుబ్బారావు అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

చీటర్ అరెస్టయ్యాడు, తమకు న్యాయం జరుగుతందని భావించిన బాధితులకు బంజారాహిల్స్ పోలీసులు షాకిచ్చారు. కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి, గుట్టు చప్పుడు కాకుండా ఆ మోసగాడిని ఇంటికి పంపించడంతో బాధితులు ఖంగు తిన్నారు. తమకు న్యాయం జరిగే మార్గమే లేదా అని బాధితులు వాపోతున్నారు.

Also read: మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు… పర్యావరణవేత్తల వార్నింగ్

Also read: మూసీకి ఇరువైపులా రెయిలింగ్.. వరదల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం

Also read: భాగ్యనగరం పరిస్థితి చూస్తే బాధగా వుంది: విజయ్

Also read: మహిళల ట్రాఫికింగ్ కేసులో ఎన్ఐఏ ఛార్జీషీట్

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు

Also read: దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్