ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగం

చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. పార్టీ నేతలతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో సంభాషించారు. పార్టీ సీనియర్ నేతలనుద్దేశించి ప్రసంగించారు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నేతల...

ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా.. చంద్రబాబు ఉద్వేగం
Follow us

|

Updated on: Sep 29, 2020 | 3:42 PM

Chandrababu emotional speech at party video conference: చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. పార్టీ నేతలతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్సులో సంభాషించారు. పార్టీ సీనియర్ నేతలనుద్దేశించి ప్రసంగించారు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, నేతల గురించి ప్రస్తావన రాగానే.. చంద్రబాబు ఎమోషనల్ అయినట్లు సమాచారం. ‘‘ ఒక నేత పార్టీని వీడితే వంద మంది లీడర్లను తయారు చేస్తా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో చంద్రబాబు సంభాషించారు. ‘‘ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్ఖానా.. ఒకరు పోతే వందమందిని తయారుచేసే సత్తా ఉన్నపార్టీ టీడీపీ.. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట.. ’’ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. కరోనా నియంత్రణలో వైసిపి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టిడిపి పనిచేస్తోందని, ఏపిలో వైసీపీ అరాచకాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రామచంద్రపై దాడికి రాజకీయాలతో సంబంధం లేదని ఎస్పీ, డిఎస్పీ మొదట చెప్పారని, దాడి జరిగిన రోజు కుమార్ రెడ్డి, ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారని, సాయంత్రానికల్లా కుమార్ రెడ్డి పేరుకు బదులు ప్రతాప్ రెడ్డి పేరు తెచ్చారని, వైసిపి స్థానంలో టిడిపిని చేర్చారని ఆయన ఆరోపించారు. వ్యవస్థలను ఏవిధంగా మేనేజ్ చేస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని చంద్రబాబు విమర్శించారు.

ఏ నేరం చేయక పోయినా టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, దుర్మార్గులకు లైసెన్స్ లిచ్చి అరాచకాలు చేయిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. బాధితులకు పోలీసులు అండగా ఉండాలే తప్ప నేరగాళ్లకు వత్తాసు పలకరాదని ఆయన సూచించారు. సీల్డ్ కవర్‌లో సాక్ష్యాధారాలు తనకు పంపాలని డీజీపీ లేఖ రాయడం హాస్యాస్పదంగా వుందన్నారు. ‘‘ నేను సాక్ష్యాధారాలు ఇస్తే వాళ్లు దర్యాప్తు చేస్తారట..ఇన్వెస్టిగేషన్ బాధ్యత పోలీసులదా, ప్రతిపక్షానిదా..? ’’ అని ప్రశ్నించారు.

ఒకవైపు కరోనా, మరోవైపు వరదలు జన జీవనాన్ని దుర్భరం చేశాయని, ముందు జాగ్రత్తలు లేవు, అప్రమత్తం చేయడం లేదు, ఉపశమన చర్యలు లేవు అని విరుచుకుపడ్డారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావ ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.