కరీంనగర్ పరిధిలోని అల్గునూర్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు. కరీంనగర్-హైదరాబాద్ హైవే నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి మానేరు వంతెనపై నుంచి కింద కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని గండి శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సునీత తో బాటు మరొకరు గాయపడ్డారు. కాగా-ఈ సంఘటనలో చంద్రశేఖర్ గౌడ్ అనే కానిస్టేబుల్.. తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జిపై నుంచి కారును పరిశీలిస్తున్న ఈయన అదుపుతప్పి కింద పడిపోయాడు.. కాలువలో నీరు తక్కువగా ఉండడంతో.గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిసింది. -బాధితులు వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. .