హైదరాబాద్ పాతబస్తీలో వింత శిశువు జననం.. లక్షల్లో ఇలా ఒకరు!

| Edited By:

Jan 11, 2020 | 4:47 PM

హైదరాబాద్ పాతబస్తీ ప్రసూతి ఆసుపత్రిలో ఓ వింత శిశువు జన్మించాడు. జహీరాబాద్‌కి చెందిన సల్మా బేగం… పాతబస్తీలోని పేట్ల బుర్జ్ మోడ్రన్ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 3వ తేదీన డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. అయితే ఈ రోజు ఉదయం.. వింతగా లింగ నిర్ధారణ లేకుండా పూర్తి అవయవాలు కాళ్లు, చేతులు సరిగా లేకుండా వింత ఆకారంలో ఉన్న ఓ బాబును డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. జన్యు లోపమే దీనికి కారణంగా డాక్టర్లు […]

హైదరాబాద్ పాతబస్తీలో వింత శిశువు జననం.. లక్షల్లో ఇలా ఒకరు!
Follow us on

హైదరాబాద్ పాతబస్తీ ప్రసూతి ఆసుపత్రిలో ఓ వింత శిశువు జన్మించాడు. జహీరాబాద్‌కి చెందిన సల్మా బేగం… పాతబస్తీలోని పేట్ల బుర్జ్ మోడ్రన్ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 3వ తేదీన డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. అయితే ఈ రోజు ఉదయం.. వింతగా లింగ నిర్ధారణ లేకుండా పూర్తి అవయవాలు కాళ్లు, చేతులు సరిగా లేకుండా వింత ఆకారంలో ఉన్న ఓ బాబును డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. జన్యు లోపమే దీనికి కారణంగా డాక్టర్లు భావిస్తున్నారు. మెరుగైన వైద్యం నిమిత్తం డాక్టర్లు, ఆ శిశువును నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. తల్లి సల్మా బేగం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఇది ఆమెకు మూడవ సంతానంగా వారు పేర్కొన్నారు. జన్మించిన శిశువు బరువు 2.5కేజీలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇలా పుట్టడాన్ని ‘హార్లేక్విన్ ఇచ్థియోసిస్’ అనే అరుదైన వ్యాధి వల్ల లక్షల్లో ఒకరు డాక్టర్లు జన్మిస్తారని డాక్టర్లు తెలిపారు.