బీహార్ లో ‘అపర భగీరరథుడు’ భూయాన్, 3 కి.మీ. కాలువ తవ్వేశాడు

బీహార్ లోని గయకు సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది కొథిలావా అనే చిన్న గ్రామం.. అక్కడ ఎండిపోతున్న తన పొలానికి నీటిని మళ్లించేందుకు లాంగీ భూయాన్ అనే వ్యక్తి 'అపర భగీరథుడే' అయ్యాడు. గ్రామానికి సమీపంలోనే..

బీహార్ లో 'అపర భగీరరథుడు' భూయాన్, 3 కి.మీ. కాలువ తవ్వేశాడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 2:49 PM

బీహార్ లోని గయకు సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది కొథిలావా అనే చిన్న గ్రామం.. అక్కడ ఎండిపోతున్న తన పొలానికి నీటిని మళ్లించేందుకు లాంగీ భూయాన్ అనే వ్యక్తి ‘అపర భగీరథుడే’ అయ్యాడు. గ్రామానికి సమీపంలోనే ఉన్న కొండలు, గుట్టల నుంచి వాన నీటిని తన పొలానికి తరలించేందుకు 30 సంవత్సరాలుగా అలుపెరగకుండా శ్రమిస్తూ 3 కి.మీ. కాలువ తవ్వాడు. ఇన్నేళ్లూ తాను దగ్గరలోని అడవుల్లోకి వెళ్తూ..ఒక్కడినే పలుగూ, పారా పట్టుకుని కాలువ తవ్వుతూ వచ్చానని. గ్రామస్తుల్లో ఎవరూ తనతో చేతులు కలపలేదని ఆయన చెప్పాడు. తన గ్రామంలోని వారంతా మనుగడ కోసం నగరాలకు, పట్టణాలకు వెళ్లారని, కానీ తను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని భూయాన్ తెలిపాడు. వర్షాకాలంలో కొండల నుంచి కిందికి ప్రవహించే నీరంతా వృధాగా నదిలో కలుస్తుందని. ఆ నీరు అలా వృధా కాకుండా  ఇలా కాలువ తవ్వానని ఈ ‘అపర భగీరథుడు’ తెలిపాడు. ఇంత జరిగినా ఇతని గ్రామంలో ఒక టీచర్ తప్ప మిగిలినవారెవరూ ఇతని కృషిని పట్టించుకోలేదు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!