బిగ్ బాస్ 4: చివరి స్థానంలో హారిక.. టైటిల్ విజేతగా అభిజిత్.? గత ఓటింగ్ రికార్డులన్నీ బ్రేక్.!!

| Edited By: Pardhasaradhi Peri

Dec 19, 2020 | 9:53 PM

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో టైటిల్ విజేత ఎవరన్నది తెలియనుంది. అయితే ఈలోపే సోషల్ మీడియాలో అనధికారికంగా..

బిగ్ బాస్ 4: చివరి స్థానంలో హారిక.. టైటిల్ విజేతగా అభిజిత్.? గత ఓటింగ్ రికార్డులన్నీ బ్రేక్.!!
Follow us on

Bigg Boss 4: బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్‌కు చేరుకుంది. మరికొన్ని గంటల్లో టైటిల్ విజేత ఎవరన్నది తెలియనుంది. అయితే ఈలోపే సోషల్ మీడియాలో అనధికారికంగా విన్నర్ ఎవరనేది ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి వారం ఎలిమినేషన్స్ లీక్ మాదిరిగానే.. ఒక్క రోజు ముందుగానే టైటిల్ విజేత అభిజిత్ అని నెట్టింట్లో వైరల్ అవుతోంది. గత బిగ్ బాస్ సీజన్ల రికార్డులను తిరగరాస్తూ అభిజిత్‌కు ఏకంగా 70 శాతం ఓటింగ్ పడినట్లు తెలుస్తోంది. అతడికి రన్నరప్‌కి మధ్య వేలాల్లో ఓట్లు తేడా ఉన్నట్లు సమాచారం. రన్నరప్‌గా అరియానా , మూడో స్థానంలో  సోహైల్ , నాలుగో స్థానంలో అఖిల్, ఐదో ప్లేస్‌లో దేత్తడి హారిక నిలిచారని వినికిడి. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు గెస్టులుగా అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి వచ్చారని.. స్పెషల్ గెస్ట్ గా అనిల్ రావిపూడి విచ్చేశారని సమాచారం. అలాగే లక్ష్మీ రాయ్, మెహరీన్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లు, తమన్ మ్యూజిక్ తో ఫైనల్ ఎపిసోడ్ ను షో నిర్వాహకులు గ్రాండ్ గా ప్లాన్ చేశారట.

ఇదిలా ఉంటే స్టార్ మా నిర్వహించిన అధికారిక ఓటింగ్ పక్కన పెడితే.. ఇప్పటిదాకా పలు వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో నిర్వహించిన ఓటింగ్ బట్టి చూస్తే కంటెస్టెంట్ల టాప్ 5 లిస్ట్ ఇలా ఉంది.

మొదటి స్థానం: అభిజిత్

రెండో స్థానం:   అరియానా గ్లోరీ 

మూడో స్థానం: సయ్యద్ సోహైల్

నాలుగో స్థానం: అఖిల్ సార్థక్ 

ఐదో స్థానం: దేత్తడి హారిక

ఇక ఈ లిస్ట్‌ను ప్రేక్షకులు ముందు నుంచి ఊహించారని చెప్పొచ్చు. మొదటి నుంచి టామ్ అండ్ జెర్రీలుగా ప్రేక్షకులను అలరించిన అరియానా, సోహైల్‌కు నిరాశే మిగిలిందని చెప్పాలి.

Also Read:

సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..