టీఎన్టీవో నేతలకు కేసీఆర్ పదవుల ఆఫర్..? బిగ్ న్యూస్-బిగ్ డిబేట్‌లో కీలక చర్చ..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని సీపీఐ పార్టీ నిర్ణయించింది. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ అల్టీమేటం వేసింది. ఇందుకు […]

టీఎన్టీవో నేతలకు కేసీఆర్ పదవుల ఆఫర్..? బిగ్ న్యూస్-బిగ్ డిబేట్‌లో కీలక చర్చ..!
Follow us

|

Updated on: Oct 15, 2019 | 2:25 AM

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని సీపీఐ పార్టీ నిర్ణయించింది. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ.. ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ అల్టీమేటం వేసింది. ఇందుకు ఈనెల 13వ తేదీని గడువుగా విధించింది. అయితే ప్రభుత్వం నుంచి గానీ, టీఆర్ఎస్ నుంచి గానీ ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ  కార్యాలయంలో నిన్న అత్యవసర సమావేశం అయింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా చర్చించారు. సుధీర్ఘ చర్చల అనంతరం టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని మెజార్టీ కార్యవర్గం నిర్ణయించింది. అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీపీఐ తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది. పరిస్థితులు చేయి దాటుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం తరుపున సీనియర్ నేత..టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు సయోధ్యకు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సమయంలోనే టీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాలకు..టీఎన్జీవో వర్గాలను మధ్య గ్యాప్ నడుస్తోంది. ఆర్టీసీ సంఘాలు చేస్తున్న సమ్మెకు టీఎన్టీవో మద్దతు తెల్పడంలేదని వాదనలు తెరపైకి వస్తున్నాయి. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావును టీఎన్జీవో సంఘం నేతలు మంగళవారం కలిశారు. ఈ సందర్బంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు సీఎంను కోరారు. కాగా… వరంగల్ జిల్లాలోని ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ అంశంపైనే టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ నిర్వహించిన బిగ్ న్యూస్-బిగ్ డిబేట్‌లో కీలక చర్చ జరిగింది.

టీఎన్జీవో నేతలకు సీఎం కేసీఆర్ పదవులను ఆఫర్ చేశారంటూ..ఆర్టీసీ కార్మిక సంఘాల నేత థామస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై టీఎన్టీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ డిటేల్స్ దిగువ వీడియోస్‌లో..