ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసైనా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులోని డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీసు స్టేషన్ల పరిధిలో ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
కాగా.. ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు నవీన్ ఫేస్‌బుక్‌లో ఓ వివాదాస్పద పోస్టు పెట్టడంతో బెంగళూరులో హింస చెలరేగిన విషయం విదితమే. హింసకు పాల్పడిన 146 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
Read More: