David Warner: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా సెలెక్టర్ల సంచలన ప్రకటన

ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే క్రికెట్ పై మక్కువతో మళ్లీ బ్యాట్ పట్టుకుంటానంటున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలనుకుంటున్నాడు. ఇదే కోరికను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందు ఉంచాడు

David Warner: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా సెలెక్టర్ల సంచలన ప్రకటన
David Warner
Follow us

|

Updated on: Jul 16, 2024 | 11:02 AM

ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే క్రికెట్ పై మక్కువతో మళ్లీ బ్యాట్ పట్టుకుంటానంటున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలనుకుంటున్నాడు. ఇదే కోరికను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందు ఉంచాడు. ‘ఒకవేళ ఎంపికైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. . వన్డే క్రికెట్‌లో అవకాశం వస్తే తప్పకుండా పునరాగమనం చేస్తాను’ అని వార్నర్ చెప్పుకొచ్చాడు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో వార్నర్ ఆడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా జట్టు చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ సంచలన ప్రకటన చేశాడు. డేవిడ్ వార్నర్ కోరుకున్నప్పటికీ, అతనిని ఎంపిక కోసం పరిగణించబోమని చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు. డేవిడ్ వార్నర్ మూడు ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడని, ఆస్ట్రేలియా క్రికెట్ కు అతను అందించిన సేవలను అభినందిస్తున్నామన్నాడు. అదే సమయంలో డేవిడ్ వార్నర్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే ఆలోచన లేదని బెయిలీ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

బెయిలీ ప్రకటనతో ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ శకం ముగిసినట్లే అని చెప్పొచ్చు. అలాగే, వార్నర్ స్థానంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు యంగ్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఇప్పటికే ఎంపికయ్యాడు. తద్వారా రానున్న రోజుల్లో ఆసీస్ తరుపున జేక్ ఫ్రేజర్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని చెప్పొచ్చు.వన్డే క్రికెట్‌లో ఆసీస్ తరఫున 161 మ్యాచ్‌లు ఆడి 159 ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలు ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా తరఫున 110 టీ20 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 2300 బంతులు ఎదుర్కొని 3277 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

112 టెస్టు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 205 ఇన్నింగ్స్‌ల్లో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలతో మొత్తం 8786 పరుగులు చేశాడు. దీని ద్వారా ఆస్ట్రేలియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 18 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌ గా రికార్డులు సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న వార్నర్.. షాక్ ఇచ్చిన సెలెక్టర్లు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానన్న వార్నర్.. షాక్ ఇచ్చిన సెలెక్టర్లు
'సారూ..బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు పింఛన్‌ ఇస్తలేరయ్యా'
'సారూ..బతికేఉన్న! సచ్చిపోయినానని సర్కారోళ్లు పింఛన్‌ ఇస్తలేరయ్యా'
యాపిల్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తినడానికి సమయం ఉందని తెలుసా
యాపిల్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తినడానికి సమయం ఉందని తెలుసా
నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య ! కాపాడబోయిన భర్త.. చివరికి
నిద్రమత్తులో రైల్లోంచి జారిపడ్డ భార్య ! కాపాడబోయిన భర్త.. చివరికి
మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా ??
మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే ఏమవుతుందో తెలుసా ??
10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు
10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు
నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురు సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురు సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్
1000 కోట్ల క్లబ్‌లో 'కల్కి'.. భాజా భజంత్రీలతో ఫ్యాన్స్ సంబరాలు
1000 కోట్ల క్లబ్‌లో 'కల్కి'.. భాజా భజంత్రీలతో ఫ్యాన్స్ సంబరాలు
పులసల సీజన్‌ షురూ.. మొదటి పులసను పట్టేశారుగా
పులసల సీజన్‌ షురూ.. మొదటి పులసను పట్టేశారుగా
మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు
మేడపై ఆవు ప్రత్యక్షం.. ఆశ్చర్యంలో స్థానికులు