Ashok Galla’s Hero : జనవరిలో దైర్యం చేసిన రానున్న మహేష్ మేనల్లుడు.. హీరో మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

| Edited By: Anil kumar poka

Nov 14, 2021 | 8:19 AM

ఘటమనేని  ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Ashok Gallas Hero : జనవరిలో దైర్యం చేసిన రానున్న మహేష్ మేనల్లుడు.. హీరో మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
Ashok
Follow us on

Ashok Galla’s Hero : ఘటమనేని  ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. కరోనా కంటే ముందే ఈ సినిమా మొదలైంది. కానీ కరోనా విజృంభించడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలోనే థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

జనవరి 26వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. జనవరిలో ప్లాన్ చేసుకున్న కొన్ని పెద్ద సినిమాలు ఫిబ్రవరికి .. ఏప్రిల్ కి వెళ్లి పోయాయి. అయితే హీరో సినిమా మాత్రం దైర్యం చేసి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీఅవుతుంది. థియేటర్లలో పూర్తి వినోదం కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో అశోక్ గల్లా చేతిలో ఓ పెద్ద హ్యామర్ పట్టుకొని ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ లుక్ – టైటిల్ టీజర్ – ‘అచ్చ తెలుగందమే’ పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Hero

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!