పేదలకు సీఎం జగన్ మరో తీపి కబురు.. జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ..!

తొలి విడత ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జులై 8న వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని నిర్ణియించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్న సీఎం.

పేదలకు సీఎం జగన్ మరో తీపి కబురు.. జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ..!
Follow us

|

Updated on: Jun 02, 2020 | 7:14 PM

ప్రతి పేదవాడి సొంతింటి కలను తప్పక నెరవేరుస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సీఎం క్యాంపు కార్యాలయంలో మొదటి విడతలో చేపట్టబోయే ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి.

తొలి విడత ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. జులై 8న వైయస్సార్‌ పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని నిర్ణియించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్న సీఎం.. వారి కేటాయించిన స్థలం వద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలన్నారు సీఎం. పేదవాడికి నిర్మిస్తున్న ఇళ్లల్లో అన్ని నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల పట్టాలను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాటికల్లా పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగితెలుసుకున్న సీఎం.. బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్న సీఎం.. పేదవాడిపై ఒక్క రూపాయి భారం పడనివ్వద్దన్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టామన్న సీఎం.. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో నిర్మాణం సాగాలన్నారు. గవర్నమెంట్ ఇచ్చే ఇళ్లు అంటే నాసిరకం అనే భావన పొగొట్టి.. నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నందున.. అయా కాలనీల్లో మౌలిక సదుపాయాలకల్పనపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇక, గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్లబకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటి వరకు 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు సకాలంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలన్నారు సీఎం.

Latest Articles
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
అక్కడ నిశ్చితార్తం చేసుకోవడానికి కారణం అదే.. అదితి రావ్ కామెంట్స
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 3, 2024): 12 రాశుల వారికి ఇలా..
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
అదరగొట్టిన హైదరాబాద్.. రాజస్థాన్ పై ఒక పరుగు తేడాతో విజయం
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యారా?భారత ప్లేయర్ల ప్లాఫ్ షో
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: మోదీ
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు జమ చేయడంతో లబ్దిదారుల ఇబ్బందులు
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
'దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం'.. మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి