ఇండియాలో రైతుల ఆందోళనకు విదేశాల్లో ప్రతిధ్వని, ఛలో ఢిల్లీకి ఎన్నారైల పిలుపు, 30 న సింఘు బోర్డర్ కు చేరిక

ఇండియాలో రైతులు చేస్తున్న ఆందోళనకు ఎన్నారైలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. మానిక్ గోయెల్,  జోబన్ రంధావా అనే ఇద్దరు ప్రవాస భారతీయులు ముఖ్యంగా కెనడా, అమెరికా దేశాల్లోని..

  • Umakanth Rao
  • Publish Date - 1:56 pm, Sat, 26 December 20
ఇండియాలో రైతుల ఆందోళనకు విదేశాల్లో ప్రతిధ్వని, ఛలో ఢిల్లీకి ఎన్నారైల పిలుపు, 30 న సింఘు బోర్డర్ కు చేరిక

ఇండియాలో రైతులు చేస్తున్న ఆందోళనకు ఎన్నారైలు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. మానిక్ గోయెల్,  జోబన్ రంధావా అనే ఇద్దరు ప్రవాస భారతీయులు ముఖ్యంగా కెనడా, అమెరికా దేశాల్లోని పంజాబీ ఎన్నారైల సపోర్టును కోరుతున్నారు. ఇండియాకు వచ్చి అన్నదాతల నిరసనకు మద్దతు పలకాలంటూ వీరు ఆన్ లైన్ ప్రచారం ప్రారంభించారు. భారత రైతులకు నైతికంగా, వస్తు పరంగా అండగా నిలవాలని అంటున్నారు. ఛలో ఢిల్లీ అనే నినాదాన్ని ఈ ఎన్నారైలు కూడా  ఎత్తుకోవడం విశేషం. కెనడా, యూఎస్ తో బాటు ఇతర దేశాల్లో ఉంటున్న ఎన్నారైలు  సైతం ఇందుకు ముందుకు రావాలని వీరు ఆహ్వానించారు. గత నెల రోజులుగా  ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు నిరసన చేస్తున్నారని పేర్కొన్నవీరు-50 మందికి పైగా ఎన్నారైలు ఢిల్లీకి బయలుదేరారని, ఈ నెల 30 న వీరంతా సింఘు బోర్డర్ చేరుకుంటారని తెలిపారు.

రానున్న రోజుల్లో వీరి సంఖ్య ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయన్నారు. రైతుల డిమాండ్లు ర్తీరాకే వీరు తిరిగి వస్తారని మానిక్ గోయెల్, జోబన్ రంధావా వెల్లడించారు. కెనడా, అమెరికా దేశాల్లో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు చాలామంది ఉన్నారు.  ఈ రాష్ట్రాల్లో వ్యవసాయం చేస్తున్న వారిలో వీరి బంధువులు, సన్నిహితులు ఉన్న విషయం గమనార్హం అని రంధావా పేర్కొన్నారు. రైతుల ఉద్యమం ప్రపంచ వ్యాప్తమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.