పేదలంద‌రికీ ఫ్రీ ఇంట‌ర్నెట్..ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ సంచ‌ల‌న నిర్ణయం

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో ఇంటర్నెట్‌ సేవలను అందించాలని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం పినరయి విజయన్‌ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న కన్సార్టియం కంపెనీల‌తో.. ఇందుకు అవసరమైన ఫైబర్‌గ్రిడ్( కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌) కె-ఫోన్‌ గురించి మీటింగ్స్ నిర్వ‌హించారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు కోసం సుమారు 1,500 కోట్ల రూపాయ‌లు ఖర్చు చేయనుండగా, ఈ సంవ‌త్స‌రం డిసెంబర్‌ కల్లా కంప్లీట్ కానుంది. సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. […]

పేదలంద‌రికీ ఫ్రీ ఇంట‌ర్నెట్..ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ సంచ‌ల‌న నిర్ణయం
Follow us

|

Updated on: May 30, 2020 | 10:10 PM

కేర‌ళ‌ రాష్ట్రంలోని పేదలందరికీ ఫ్రీగా, మిగిలిన వ‌ర్గాల‌కు అందుబాటు ధరలలో ఇంటర్నెట్‌ సేవలను అందించాలని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణయించింది. శుక్రవారం సీఎం పినరయి విజయన్‌ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న కన్సార్టియం కంపెనీల‌తో.. ఇందుకు అవసరమైన ఫైబర్‌గ్రిడ్( కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌) కె-ఫోన్‌ గురించి మీటింగ్స్ నిర్వ‌హించారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు కోసం సుమారు 1,500 కోట్ల రూపాయ‌లు ఖర్చు చేయనుండగా, ఈ సంవ‌త్స‌రం డిసెంబర్‌ కల్లా కంప్లీట్ కానుంది.

సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ ఫెసిలిటీ పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించిన దేశంలోనే మొద‌టి రాష్ట్రం కేర‌ళ‌. ఇప్పటి వరకు ఏ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ కూడా ఆ దిశగా అడుగులు వేయ‌లేదు. ఈ సదుపాయం వల్ల డిజిటల్‌ రంగంలో మరింత వృద్ధి సాధ్య‌ప‌డుతుంది. కరోనా వైరస్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు లేట‌య్యాయి. అయినప్పటికీ డిసెంబరు కల్లా అన్ని వ‌ర్క్స్ కంప్లీట్ చేస్తామ‌ని ఎమ్‌.వి గౌతమ్‌ (కన్సార్టియం లీడర్‌) మాటిచ్చారు” అంటూ విజయన్ తెలిపారు.

Latest Articles