మానవతా ! నువ్వెక్కడ ?.ఆటోను ఆపిన పోలీసులు.. తండ్రిని భుజాన మోసిన కొడుకు

లాక్ డౌన్ ఆ తండ్రీ కొడుకులకు శాపంగా పరిణమించింది. కేరళ లోని కొల్లం జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన ఇది.. అస్వస్థుడై.. ఆసుపత్రి పాలై కోలుకున్న ఆ తండ్రిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. ఆయన కొడుకు తన తండ్రిని ఆటోలో ఇంటికి తీసుకువెళ్తుండగా .. మధ్య దారిలోనే లాక్ డౌన్ ఉందని,, ముందుకు వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు ఆపేశారు. హాస్పిటల్ డాక్యుమెంట్స్ చూపినా వారు కరుణించలేదు. దీంతో ఆ కుమారుడు తన తండ్రిని భుజాలపై మోసుకుంటూ […]

మానవతా ! నువ్వెక్కడ ?.ఆటోను ఆపిన పోలీసులు.. తండ్రిని భుజాన మోసిన కొడుకు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 16, 2020 | 10:40 AM

లాక్ డౌన్ ఆ తండ్రీ కొడుకులకు శాపంగా పరిణమించింది. కేరళ లోని కొల్లం జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన ఇది.. అస్వస్థుడై.. ఆసుపత్రి పాలై కోలుకున్న ఆ తండ్రిని డాక్టర్లు డిశ్చార్జి చేశారు. ఆయన కొడుకు తన తండ్రిని ఆటోలో ఇంటికి తీసుకువెళ్తుండగా .. మధ్య దారిలోనే లాక్ డౌన్ ఉందని,, ముందుకు వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీసులు ఆపేశారు. హాస్పిటల్ డాక్యుమెంట్స్ చూపినా వారు కరుణించలేదు. దీంతో ఆ కుమారుడు తన తండ్రిని భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ దూరం మేరా ఎండలో నడుచుకుంటూ తీసుకువెళ్లాడు. కేరళ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై స్పదించి.. సుమోటో కేసు రిజిస్టర్ చేసింది. ఆ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.