Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుపతి: రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం. ఎనభై రోజుల తరవాత ప్రారంభమవుతున్న దర్శనాలు. రేపు ఎల్లుండి ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు. పదో తేదీ తిరుమల పై ఉన్న స్థానికులకు దర్శనాలు. 11వతీదీ నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం. జూన్ నెలకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో లభ్యం. ఆఫ్ లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు లభ్యం. అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి. కాణిపాకం దేవాలయంలో రేపటి నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్. పదో తేదీ నుంచి గంటకు మూడువందలమంది వరకూ భక్తులకు దర్శనాలు. శ్రీకాళహస్తిలో దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని ప్రకటించిన అధికారులు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

మహిళల్ని వేధించే కీచకుడి అరెస్ట్

Kerala, మహిళల్ని వేధించే కీచకుడి అరెస్ట్

వివాహిత మహిళలను టార్గెట్‌ చేసి.. మార్ఫ్‌డ్‌ ఫోటోలతో బెదిరించి.. లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ యువకుడిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రదీశ్‌ కుమార్‌(25) ఇంటి పట్టున ఉండే వివాహిత మహిళల్ని టార్గెట్‌ చేస్తాడు‌. నెమ్మదిగా వారితో పరిచయం పెంచుకుంటాడు. వారి కుటుంబంలో ఏవైనా ఇబ్బదులు ఉన్నాయేమో తెలుసుకుంటాడు. సాయం చేస్తానని నమ్మబలికి వారి భర్తల ఫోన్‌ నెంబర్లు సంపాదిస్తాడు. తర్వాత అమ్మాయి ఫోటోతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి.. సదరు మహిళల భర్తలకు వల వేస్తాడు. వారితో చాట్‌ చేసి.. వాటి స్క్రీన్‌ షాట్స్‌ను వారి భార్యలకు పంపిస్తాడు. తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని నమ్మిస్తాడు. ఈ ప్లాన్‌ వర్క్‌వుట్‌ అయ్యి సదరు మహిళలు భర్తను దూరంగా పెట్టాక.. ఓదార్పు పేరుతో ఆ గృహిణిలకు దగ్గరవుతాడు.

వారిని వీడియో చాట్‌కు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత సదరు మహిళల మార్ఫ్‌డ్‌ ఫోటోలు చూపించి, మాట వినకపోతే ఈ ఫోటోలను వారి భర్తలకు చూపిస్తానని బెదిరించి వారిని లొంగదీసుకుంటారు. ఇలా ఏకంగా 50 మంది మహిళల్ని నమ్మించి, మోసం చేసి, బెదిరించి దారుణాలకు పాల్పడ్డాడు. చివరకు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువకుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి.. అతని నుంచి మహిళల మార్ఫ్‌డ్‌ ఫోటోలను, ల్యాప్‌టాప్‌ని స్వాధీనం చేసుకున్నారు.

Related Tags