అక్కడ రూపాయికే అంత్యక్రియలు

కరీంనగర్ : ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌.. మరో గొప్ప పథకానికి ముందడుగు వేశారు. పేదల కుటుంబాల్లో  ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు చేయించేందుకు కూడా కొంతమంది  వద్ద డబ్బులు ఉండవు. జీవించి ఉన్నంత కాలం ఏం సంపాదించారో, ఏం పోగొట్టుకున్నామనేది పక్కనబెడితే.. చనిపోయాకైనా వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం కరీంనగర్ నగరపాలక సంస్థ వినూత్న […]

అక్కడ రూపాయికే అంత్యక్రియలు
Kims hospital staff negligence
Follow us

|

Updated on: May 21, 2019 | 11:33 AM

కరీంనగర్ : ఒక రూపాయికే నల్లా కనెక్షన్‌ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌.. మరో గొప్ప పథకానికి ముందడుగు వేశారు. పేదల కుటుంబాల్లో  ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు చేయించేందుకు కూడా కొంతమంది  వద్ద డబ్బులు ఉండవు. జీవించి ఉన్నంత కాలం ఏం సంపాదించారో, ఏం పోగొట్టుకున్నామనేది పక్కనబెడితే.. చనిపోయాకైనా వారికి ఘనంగా వీడ్కోలు పలకాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం కరీంనగర్ నగరపాలక సంస్థ వినూత్న పథకానికి తెర తీసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రకటించారు.

కరీంనగర్‌లో సోమవారం రవీందర్‌సింగ్‌ విలేకర్లతో మాట్లాడారు.  నగరంలో ఎవరు చనిపోయినా రూపాయి చెల్లిస్తే చాలు వారి మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు, దహన సంస్కారాలు చేపడతామని తెలిపారు. వచ్చే 15లోగా పూర్తి కార్యాచరణతో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. పేదలకు భారం కలగకుండా దాతల సాయంతో నిధులు సమకూర్చుతామని తెలిపారు. నగర పాలక సంస్థ  ద్వారా రూ.1.10కోట్లు కేటాయించామని, రూ.50లక్షలతో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపామని చెప్పారు. దాతల కోసం ప్రత్యేకంగా నగర పాలక కమిషనర్‌ పేరు మీద ఖాతా ఏర్పాటు చేస్తామన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి 50 మందికి సరిపడా భోజనం రూ.5కే అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు.