లాంగ్ మార్చ్‌పై లొల్లే లొల్లి… ఆఖరి నిమిషంలో ఆగేనా ?

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జనసేన చీఫ్‌ పవన్‌కళ్యాణ్‌  లాంగ్‌మార్చ్‌ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్‌ చేపబడుతోంది లాంగ్‌ మార్చ్‌ కాదు…రాంగ్‌ మార్చ్‌ అని మంత్రి అని ఎద్దేవా చేశారు. మరోమంత్రి అయితే ఏకంగా సొంత పుత్రుడు (నారాలోకేశ్) పనికి రాడన్న ఉద్దేశంతోనే దత్తపుత్రున్ని (పవన్ కల్యాణ్) చంద్రబాబు రంగంలోకి దింపారని కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆదివారం చలో విశాఖట్టణం కార్యక్రమాన్ని […]

లాంగ్ మార్చ్‌పై లొల్లే లొల్లి... ఆఖరి నిమిషంలో ఆగేనా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 02, 2019 | 6:58 PM

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జనసేన చీఫ్‌ పవన్‌కళ్యాణ్‌  లాంగ్‌మార్చ్‌ ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్‌ చేపబడుతోంది లాంగ్‌ మార్చ్‌ కాదు…రాంగ్‌ మార్చ్‌ అని మంత్రి అని ఎద్దేవా చేశారు. మరోమంత్రి అయితే ఏకంగా సొంత పుత్రుడు (నారాలోకేశ్) పనికి రాడన్న ఉద్దేశంతోనే దత్తపుత్రున్ని (పవన్ కల్యాణ్) చంద్రబాబు రంగంలోకి దింపారని కామెంట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఆదివారం చలో విశాఖట్టణం కార్యక్రమాన్ని నిర్వహింబోతున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. దీనికి లాంగ్ మార్చ్ అని నామకరణం చేశారు. ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యపై వామపక్షాలు, బీజేపీ, టీడీపీ ఇప్పటివరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. విశాఖలో నిర్వహించే ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతిచ్చి, పాల్గొనాలని పవన్‌కల్యాణ్‌ కోరారు. రెండు రోజుల క్రితం ఏపీలోని అన్ని పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులకు ఫోన్ చేసి వారి మద్దతు కోరారు జనసేన అధినేత.
దాదాపు అన్ని పార్టీలు నిర్మాణ రంగ కార్మికుల సమస్యపై జనసేన తలపెట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపాయి. లాంగ్‌మార్చ్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఆదివారం విశాఖ ర్యాలీలో ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు పాల్గొననున్నారు. ఈ మేరకు లాంగ్‌మార్చ్‌లో పాల్గొనాలని ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు మాజీ మంత్రులకు ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాలిచ్చింది. అయితే వీరిలో ఎవరెవరు లాంగ్ మార్చ్‌కు హాజరవుతారన్నది అనుమానంగానే కనిపిస్తోంది.
పవన్‌ లాంగ్‌మార్చ్‌కు సంఘీభావం తెలియజేసిన వామపక్ష పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనబోమని స్పష్టం చేశాయి. ఇటు బీజేపీ కూడా సంఘీభావానికే పరిమితమైనట్టు తెలుస్తోంది. లోక్‌సత్తా పార్టీ కూడా జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్‌కు మద్దతు ప్రకటించింది. తమ పార్టీ వర్గాలు పాల్గొంటాయని ప్రకటించింది.
నిర్మాణ కార్మికుల బాధలు చూడలేకే పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌కి పిలుపునిచ్చారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానంపై అనేక విమర్శలు చేసిన జగన్‌..వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరా ఆపేశారని ఆరోపించారు. ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని మెగా బ్రదర్ నాగబాబు పిలుపునిచ్చారు.
పవన్‌ లాంగ్‌మార్చ్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్  మండిపడ్డారు. గత ఐదేళ్లుగా టీడీపీ అనుబంధ పార్టీగానే నడుస్తోందని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. పవన్‌ చేపడుతోంది లాంగ్‌ మార్చ్‌ కాదు.. రాంగ్‌ మార్చ్‌ అని ఎద్దేవాచేశారు. చంద్రబాబు పిలుపు ఇవ్వగానే జనసేన ఆందోళన చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్ నడుస్తున్నాడని అంజాద్ బాషా ఆరోపించారు.
మరోవైపు లాంగ్‌ మార్చ్‌కి విశాఖలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో సభకు విమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న స్థలంలో అనుమతిచ్చామని పోలీసులు తెలిపారు. మొత్తమ్మీద ఆదివారం హాట్ హాట్ పొలిటికల్ స్టంట్‌కు విశాఖ వేదిక కాబోతోంది.

Latest Articles
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
వారెవ్వా.. ఏం ఐడియా గురూ! ఏకంగా కారులోనే దుకాణం పెట్టేశాడుగా..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ! ఏకంగా కారులోనే దుకాణం పెట్టేశాడుగా..
అక్కినేని అందగాడి కార్, బైక్ కలెక్షన్ చూశారా ..?
అక్కినేని అందగాడి కార్, బైక్ కలెక్షన్ చూశారా ..?
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ స్పీడుగా వర్క్ చేస్తుంది!
ఈ ఫుడ్స్ పిల్లలకు పెట్టారంటే.. బ్రెయిన్ స్పీడుగా వర్క్ చేస్తుంది!
ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియుడు దారుణం
ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ప్రియుడు దారుణం
రొమాన్స్ పై ఆసక్తి తగ్గుతుందా ?? దంపతులు.. ఈ టిప్స్ మీ కోసమే
రొమాన్స్ పై ఆసక్తి తగ్గుతుందా ?? దంపతులు.. ఈ టిప్స్ మీ కోసమే
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలోనూ జన్ ఔషధి షాపులు..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. స్టేషన్లలోనూ జన్ ఔషధి షాపులు..
ఆ హీరోయిన్ కోసం రెండు ఐపీఎల్ టికెట్లు కొన్ని దళపతి విజయ్..
ఆ హీరోయిన్ కోసం రెండు ఐపీఎల్ టికెట్లు కొన్ని దళపతి విజయ్..
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌
టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌